JioMeet vs Zoom: జియో మీట్‌కి జూమ్‌కి తేడాలు ఏంటి ?

Jio Meet vs Zoom: జియోమీట్.. ఇటీవల వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో బాగా వినబడుతున్న పేరు ఇది. టెలికాం రంగంలో జియో రాక ఎంత విప్లవం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమ రాకతో టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో సంస్థ.. ఇటీవలె జియో మీట్‌తో ( Jiomeet ) వీడియో కాన్ఫరెన్సింగ్‌లోకి కూడా అడుగుపెట్టింది.

Last Updated : Jul 7, 2020, 09:14 PM IST
JioMeet vs Zoom: జియో మీట్‌కి జూమ్‌కి తేడాలు ఏంటి ?

Jio Meet vs Zoom: జియోమీట్.. ఇటీవల వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో బాగా వినబడుతున్న పేరు ఇది. టెలికాం రంగంలో జియో రాక ఎంత విప్లవం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమ రాకతో టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో సంస్థ.. ఇటీవలె జియో మీట్‌తో ( Jiomeet ) వీడియో కాన్ఫరెన్సింగ్‌లోకి కూడా అడుగుపెట్టింది. జూమ్‌తో పాటు ( Zoom ) ఇతర వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్స్‌కి పోటీగా జియో మీట్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. మరి జియోమీట్‌కి, జూమ్‌‌కి మధ్య ఉన్న తేడాలు ఏంటి ? జియో మీట్ ఫీచర్స్‌కి ( Jio meet features ) జూమ్ ఫీచర్స్‌కి ఉన్న వ్యత్యాసాలు ఏంటి అనేది మనం ఓసారి పరిశీలిద్దాం.

Also read: Apps banned in China: గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్ సహా చైనాలో ఇవన్నీ నిషేధమే

జూమ్ యాప్ ( Zoom App ) ద్వారా కానీ జూమ్ వెబ్ వెర్షన్ ద్వారా కానీ ఉచితంగా లభించే సేవలతో ముగ్గురి కంటే ఎక్కువ మంది యూజర్స్ ( Zoom users ) మీటింగ్‌లో పాల్గొనాల్సి వస్తే.. ఆ సెషన్ 40 నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగదు. ఒకవేళ 40 నిమిషాల కన్నా ఎక్కువసేపు మీటింగ్ నిర్వహించుకోవాల్సి వస్తే.. ఆ సెషన్ నుంచి ఎగ్జిట్ అయి మళ్లీ కొత్త సెషన్ ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. కానీ జియో మీట్ ( Jio Meet ) అలా కాదు.. ఒకేసారి 100 మంది వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా వీడియో కాన్ఫరెన్స్ ( Video conferencing ) నిర్వహించుకోవచ్చు. Also read: Moj app: TikTok కి ప్రత్యామ్నాయంగా మరో యాప్ లాంచ్ చేసిన ShareChat

Trending News