Jio Fiber Plans: జియో ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల్ని చిన్న పట్టణాల్లో కూడా విస్తరించింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా నెల రోజులు ఉచిత సేవల్ని అందిస్తోంది. ఫ్రీ ట్రయల్స్‌లో కూడా ఉచిత ఆఫర్లు ఇస్తుండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో జియో ఫైబర్ ( Jio Fiber ) హై స్పీడ్ ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించడం ద్వారా చిన్న పట్టణాలకూ విస్తరించింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది. ఫ్రీ ట్రయల్స్ ( Jio Fiber Free Trials ) లో కూడా 4కే సెట్ టాప్ బాక్స్, ఉచితంగా 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ( Free ott apps subscription ), ఉచితంగా వాయిస్ కాలింగ్ ( Unlimited free voice calls ) అందిస్తోంది. 30 రోజుల తరువాత నచ్చకపోతే వదిలేయవచ్చు కూడా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో జియో ఫైబర్ విస్తరించింది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతరపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, హిందూపురం, తెనాలి, బొబ్బిలి వంటి ప్రాంతాల్లో జియో ఫైబర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. జియో ఫైబర్‌పై ఆసక్తి ఉంటే..https://www.jio.com/registration ద్వారా నమోదు చేసుకోవచ్చని జియో ఫైబర్ ప్రకటించింది.
Also read: Srinagar Tourist Places: శ్రీనగర్ పర్యాటక ప్రాంతాలు ఎంత అందంగా ఉన్నాయో చూశారా
జియో ఫైబర్ సరికొత్త ప్లాన్స్ ( Jio Fiber Plans ) ఇవే
జియో ఫైబర్ 399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. అదే నెలకు 699 రూపాయల ప్లాన్ తీసుకుంటే..100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. ఇక జియో 999 రూపాయల ప్లాన్‌లో..150 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ సేవలతో పాటు..అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అదనంగా 11 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి. జియో ఫైబర్ 1499 రూపాయల ప్లాన్ తీసుకుంటే..3 వందల ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ ( Jio Fiber free plans ) ఉచితంగా లభిస్తాయి. ఇక 15 వందల రూపాయల విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి.
Also read: Petrol-Diesel Prices: బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక ప్రకటన : ధరలు తగ్గనున్నాయా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook