ఇకపై నో ఫ్రీ మీల్స్.. కొనుక్కోవాల్సిందేనన్న ఎయిర్ లైన్స్ సంస్థ

జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్ లైన్స్ ఎకానమి క్లాస్‌లో డొమేస్టిక్ ట్రావెలర్స్‌కి కాంప్లిమెంటరీ మీల్స్ రద్దు 

Last Updated : Sep 19, 2018, 09:10 PM IST
ఇకపై నో ఫ్రీ మీల్స్.. కొనుక్కోవాల్సిందేనన్న ఎయిర్ లైన్స్ సంస్థ

సెప్టెంబర్ 25 తర్వాత దేశంలోని వివిధ గమ్యస్థానాలకు(డొమెస్టిక్) ఎకానమి క్లాస్‌లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు కేవలం టీ, కాఫీ మినహాయించి ఉచిత భోజన సౌకర్యం(కాంప్లిమెంటరీ మీల్స్) అందించబోమని జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పష్టంచేసింది. సెప్టెంబర్ 24వ తేదీ లోపు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ షరతు వర్తించదని ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్.. విదేశీ గమ్యస్థానాలకు టికెట్ బుక్ చేసుకునే వారికి కూడా ఈ షరతులు వర్తించవని తేల్చిచెప్పింది.

Trending News