జనతా కర్ఫ్యూ వేళ.. రోడ్లన్నీ నిర్మానుశ్యం..!!

కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు ప్రధాని నరేంద్ర  మోదీ ఇచ్చిన పిలుపునకు జనం భారీగా  స్పందించారు. ఎక్కడికక్కడ ఇళ్లకే పరిమితమయ్యారు.  దేశవ్యాప్తంగా ఇదే  పరిస్థితి కనిపిస్తోంది. కాశ్మీర్  నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బంద్ వాతావరణమే కనిపిస్తోంది.  రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

Last Updated : Mar 22, 2020, 10:28 AM IST
జనతా కర్ఫ్యూ వేళ.. రోడ్లన్నీ నిర్మానుశ్యం..!!

కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు ప్రధాని నరేంద్ర  మోదీ ఇచ్చిన పిలుపునకు జనం భారీగా  స్పందించారు. ఎక్కడికక్కడ ఇళ్లకే పరిమితమయ్యారు.  దేశవ్యాప్తంగా ఇదే  పరిస్థితి కనిపిస్తోంది. కాశ్మీర్  నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బంద్ వాతావరణమే కనిపిస్తోంది.  రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 

జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం చేసుకున్నారు.  కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే బ్రేక్ ఉండాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ జనాత కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. దీన్ని పెద్ద ఎత్తున్న ప్రచారం చేయడంతోపాటు పకడ్బందీగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం పక్కాగా అమలవుతోంది. నిత్యావసరాలు అన్నీ కూడా నిన్ననే తీసుకొచ్చి పెట్టుకున్నారు జనం.  దీంతో ఈ రోజు స్వీయ నిర్బంధం వీలుపడింది. ఉదయం పూట అక్కడక్కడా పాల కేంద్రాలు తప్ప మిగతా ఎలాంటి దుకాణాలు తెరవలేదు.  

రైళ్లు, విమానాలు, బస్సులు అన్నీ రద్దు చేయడంతో జనం ఎక్కడికీ  ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ రోజు ఆదివారం కూడా కావడంతో చాలా వరకు అందరికీ సెలవు  ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదు.  జనతా కర్ఫ్యూ రాత్రి 9 గంటల  వరకు అమలులో ఉంటుంది. 

మరోవైపు  ఢిల్లీలో రోడ్లపై కనిపించిన కొంత మందికి పోలీసులు పువ్వులు ఇచ్చి .. ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు.  రాత్రి  వరకు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని కోరారు. 

దేశ  చరిత్రలో తొలిసారిగా రద్దు చేసిన 3 వేల 700  రైళ్లు..  ఇవాళ  రాత్రి 10  గంటల నుంచి  తిరిగి యథావిధిగా సేవలు అందించనున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News