ISRO successfully launches PSLVC49: శ్రీహరికోట: ఇస్రో విజయాల ఖాతాలో మరో విజయం నమోదైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ( SHAR-ISRO) నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్‌వి-సీ49 ( PSLV-c49) రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం జరిగిన 15 నిమిషాల అనంతరం రాకెట్ మోసుకెళ్లిన 10 శాటిలైట్స్‌ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
Watch Live: Launch of EOS-01 and 9 customer satellites by PSLV-49 https://t.co/H4jE2fUhNQ
— ISRO (@isro) November 7, 2020
రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాల్లో ఒకటి భారత్‌కి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ( EOS-01) కాగా మరో 9 ఉపగ్రహాలు విదేశాలకు చెందినని ఉన్నాయి. విదేశీ ఉపగ్రహాల్లో లిత్వేనియాకు చెందిన 2 R2 శాటిలైట్స్, లగ్జంబర్గ్ చెందిన నాలుగు క్లియోస్ (KSM-1A/1B/1C/1D satellites ) శాటిలైట్స్, అమెరికాకు చెందిన నాలుగు లెమూర్ (Lemur-1/2/3/4 satellites) ఉన్నాయి. Also read : US Election Results: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ జో బిడెన్‌దే ఆధిక్యం
#EOS01 successfully separated from fourth stage of #PSLVC49 and injected into orbit#ISRO pic.twitter.com/2u5jBPGNQD
— ISRO (@isro) November 7, 2020
తొలుత భారత్‌కి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ( EOS-01)ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనంతరం మిగతా 9 ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీ-C49 విజయవంతంగా ఆర్బిట్‌లోకి ఇంజెక్ట్ చేసింది.
All nine customer satellites successfully separated and injected into their intended orbit#PSLVC49 pic.twitter.com/rrtL3sVAI3
— ISRO (@isro) November 7, 2020
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్ అనంతరం ఇస్రో చేసిన తొలి ఉపగ్రహ ప్రయోగం ఇదే. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాకెట్ 3.02 గంటలకు ఉపగ్రహ ప్రయోగం చేయాల్సి ఉన్నప్పటికీ.. భారీ వర్షం కారణంగా మిషన్ డైరెక్టర్ ఈ ప్రయోగాన్ని 10 నిమిషాలు వాయిదా వేసినట్టు ఇస్రో ప్రకటించింది.
#ISRO #EOS01
Mission Director has authorised the launch of #PSLVC49 at 1512 hrs IST— ISRO (@isro) November 7, 2020
దీంతో 10 నిమిషాలు ఆలస్యంగా 3.12 గంటలకు పీఎస్ఎల్వీ-సీ49ని లాంచ్ చేశారు.
Also read : India Covid-19: 78 లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe