ఈ విషయంలో మోదీకి మేము మద్దతు ఇస్తాం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలా రోజుల తర్వాత మోదీకి మద్దతు ప్రకటిస్తామని తెలిపారు.

Last Updated : Jul 17, 2018, 12:32 AM IST
ఈ విషయంలో మోదీకి మేము మద్దతు ఇస్తాం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలా రోజుల తర్వాత మోదీకి మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఎందుకోసమో ఈ మద్దతు తెలుసా? మహిళల రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోద ముద్ర వేసే విషయంలో ఈ మద్దతు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇదే అంశం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే ఒక లేఖ కూడా రాసినట్లు రాహుల్ ట్విటర్ వేదికగా తెలిపారు.

ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరమని.. త్వరలోనే జరగబోయే వర్షాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడితే తాను మద్దతు ఇస్తానని రాహుల్ తెలిపారు. 2010లో ఇప్పటికే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించిందని.. అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే బిల్లు లోక్ సభలో ఆమోదానికి నోచుకోలేదని రాహుల్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఈసారైనా ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడితే మంచిదని ఆయన సెలవిచ్చారు. 

మహిళా సాధికారిత గురించి ఎప్పుడూ మాట్లాడే మోదీ ఈ బిల్లుకు ఇప్పటికైనా స్వేచ్ఛను ప్రసాదించాలని రాహుల్ కోరారు. 2010లో తాము ఇదే బిల్లును రాజ్యసభలో ప్రవేశబెట్టినప్పుడు ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ప్రశంసించారని.. అయితే ప్రభుత్వం మారాక మాత్రం బిల్లు ఆలస్యమవుతూ వచ్చిందని రాహుల్ తెలిపారు. బహుశా బీజేపీకి ఈ బిల్లు విషయంలో ఇతరత్రా ఆలోచనలు ఉన్నాయేమో అన్న సంశయాన్ని కూడా రాహుల్ వ్యక్తం చేశారు. 

Trending News