ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కరోనా వైరస్ (Coronavirus). ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తొలుత ఆరోగ్య అత్యయిక పరిస్థితిని విధించింది. కొన్ని రోజుల తర్వాత కోవిడ్19ను ఓ మహమ్మారిగా అభివర్ణిస్తూ దీని బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు సూచించింది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ఆల్కాహాల్‌తో తయారు చేసిన శానిటైజర్లు వాడాలని చెప్పింది. ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, దగ్గు, జలుబు ఉన్నా, జ్వరం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
తెలంగాణలో కరోనా ప్రకంపనలు.. 13కి చేరిన కేసులు
అయితే యాంటీ బయాటిక్స్ వాడితే కరోనా వైరస్ బారి నుంచి కాపాడుతుందని ప్రచారం జరుగుతోంది. పారాసిటమల్ లేక ఏదైనా యాంటీ బయాటిక్స్ వాడితే కరోనాను నిర్మూలిస్తుందని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై సమాచార ప్రసారాల శాఖ స్పందించింది. యాంటీ బయాటిక్స్ (Antibiotics) కరోనా వైరస్‌పై పోరాడలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!
#PIBFACTCHECK: NO! Antibiotics do not work against #Coronavirus
Since antibiotics only work against bacteria, it can’t be effective in preventing #Coronavirus
Get your facts from trusted sources. Beware of #fakenews!#CoronaVirusUpdate pic.twitter.com/PyFQvTlsnE
— PIB Fact Check (@PIBFactCheck) March 19, 2020
ఆ ట్వీట్ ప్రకారం.. యాంటీ బయాటిక్స్ కేవలం బ్యాక్టీరియాపై మాత్రమే పనిచేస్తుందని, కరోనా వైరస్ బారి నుంచి కాపాడే అవకాశమే లేదు. వదంతులు నమ్మవద్దు, కేవలం అధికారిక వర్గాలు, విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సమాచారాన్ని అందించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Also Read: CBSE బోర్డ్ ఎగ్జామ్స్ వాయిదా