Famous Sexologist Dr Mahinder Watsa passes away: దేశంలోనే ప్రముఖ సెక్స్పర్ట్గా పేరొందిన డా మహిందర్ వత్స సోమవారం ముంబైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 96 ఏళ్లు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌నకు చెందిన ముంబై మిర్రర్ మ్యాగజైన్లో 'ఆస్క్ ది సెక్స్‌పర్ట్' అనే కాలం ద్వారా గత 15 ఏళ్లుగా పాఠకులు అడిగిన సెక్స్ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ వచ్చిన ఆయన రెండు కారణాల వల్ల భారత్‌లో పేరొందిన సెక్స్పర్ట్గా ఫేమస్ అయ్యారు.
సెక్స్ ఎడ్యుకేషన్ ( Sex education ) పేరెత్తితేనే ఏదో తప్పు జరిగిపోతున్నట్టుగా చూసే దేశంలో అనేక సెక్స్ సమస్యలకు సమాధానాలు ఇస్తూ జనాన్ని సెక్సాలజీ పరంగా ఎడ్యుకేట్ చేయడం ఒకటైతే.. ఆ సమాధానాలను తేలిక పద్ధతిలో, మరింత సరదాగా నవ్వుకునేలా రిప్లై ఇవ్వడం ఆయన్ను సెక్స్ ఎడ్యుకేషన్‌లో ప్రత్యేకం చేసిన అంశాల్లో రెండోది.
Dr Mahinder Watsa passes away at 96!!! 😔
At a time when sex was much more taboo than today, he spoke about it publicly, loudly, with clarity and most-importantly, with humour!!!
May his soul find peace!!! 🙏🏻🙏🏻🙏🏻— The Filmy Foodie (@filmy_foodie) December 28, 2020
ఈ రెండు విషయాలు సెక్సాలజీలో డా మహిందర్ వత్సను ఫేమస్ అయ్యేలా చేశాయి. అందుకే డా మహిందర్ వత్స గురించి తెలిసిన వారు తమదైన శైలిలో ఆయనకు ట్విటర్ ద్వారా నివాళి అర్పిస్తున్నారు.
The old man who taught us all about sex through his hilarious and witty column is no more.
My Catholic school didn't impart sex education, and most of us understood the basics by reading Watsa's columns.
Rest in peace Dr Mahinder Watsa. pic.twitter.com/i8x5kVApcm
— Hamza Lakdawala (@hamzamlakdawala) December 28, 2020
Also read : Obesity health issues: లావుగా ఉంటే లైంగిక సమస్యలు వస్తాయా ? లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందా ?
డా మహిందర్ వత్స ప్రస్థానం.. ( Dr Mahinder Watsa profile ):
డా మహిందర్ వత్స ప్రస్థానం విషయానికొస్తే... తన కెరీర్ లో మొదటి 40 ఏళ్లు గైనకాలజిస్టుగా, అబ్స్టేట్రిషియన్గా సేవలు అందించిన డా వత్స.. ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సెక్సువల్ కౌన్సిలింగ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ( sexual counseling and education programme ) విభాగానికి కన్సల్టెంట్‌గా పనిచేశారు.
DR MAHINDER WATSA DIED IN 96 AGED
Dr Mahinder Watsa was an Indian sexologist who was well known for his sex columns in newspapers and magazines. His contributions to promote sex education in India earned him accolades and awards pic.twitter.com/VWLk9oDIPc
— BIN BADAR NEWS (@BinNews) December 28, 2020
1974లో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( Family Planning Association of India ) వారు సెక్సువల్ కౌన్సిలింగ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించగా.. 1980 ఆరంభంలోనే ఆయన గైనకాలజిస్ట్, అబ్స్టేట్రిషియన్గా తన విధులకు గుడ్ బై చెప్పి సెక్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. అలా మొదలైన వత్స సెక్స్‌పర్ట్ కెరీర్ ( Sexologist Dr Mahindra Watsa career ) ఆయనకు కొద్దికాలంలోనే ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.