India China border Issue: కేంద్ర సర్కారుపై చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు..

చైనా సరిహద్దులో లడఖ్ వద్ద గల గాల్వన్ లోయలోని సమస్యాత్మక ప్రాంతం నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లినట్టు ప్రసార మాధ్యమాల్లో వార్తల  నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jul 8, 2020, 07:22 PM IST
 India China border Issue: కేంద్ర సర్కారుపై చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు..

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో లడఖ్ వద్ద గల గాల్వన్ లోయలోని సమస్యాత్మక ప్రాంతం నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లినట్టు ప్రసార మాధ్యమాల్లో వార్తల  నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా చైనా బలగాలు వెనక్కి వెళ్లాయన్న అంశంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

Also Read: Indo China tensions: చైనాకు కంటి మీద కునుకులేకుండా చేస్తోన్న లఢక్ అభివృద్ధి

అంతేకాకుండా చిదంబరం స్పందిస్తూ.. చైనా బలగాలు వెనక్కి మరలడాన్ని స్వాగతిస్తున్నానని, ఏ ప్రదేశం నుంచి చైనా తన బలగాలను వెనక్కి తీసుకుందని, ఇప్పుడు ఆ బలగాలు ఎక్కడున్నాయనే వివరాలను నాకు ఎవరైనా తెలపగలరా అని ప్రశ్నించారు. కేంద్రం దీనిపై స్పష్టతనివ్వాల్సిన అవసరముందని పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వివాదాస్పద అంశంపై వివరణనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు జూన్ 15న ఏం జరిగిందన్న దానిపై భారతీయులందరూ తహతహలాడిపోతున్నారంటూ చిదంబరం ట్విట్టర్ లో పేర్కొన్నారు.
( Also read: China Troops At LAC: భారత్‌ దెబ్బకు వెన‌క్కి త‌గ్గిన చైనా, గుడారాలతో సహా! )

జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News