/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడం..కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ఆఫ్ఘనిస్తాన్ రూపంలో మరో ప్రమాదం ఎదురుకానుంది. ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు వచ్చినవారికి కోవిడ్ 19 సోకిందా..

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)దేశంలో ఇంకా స్థిరంగా కొనసాగుతూ రోజుకు 30-35 వేల కేసుల నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంతో మరోసారి ఆందోళన రేగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ప్రయాణీకుల్లో ఇద్దరికీ కోవిడ్ 19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో కలకలం కలుగుతోంది. ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు వచ్చిన 146 మందిలో ఇద్దరికి కోవిడ్ సోకినట్టు తేలింది. విదేశీయులకు అమలు చేస్తున్న మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ల ఆందోళన, కాబూల్ విమానాశ్రయంలో పెద్దఎత్తున జనం గుమిగూడటంతో కరోనా సంక్రమణ పరిస్థితిపై ఆందోళన నెలకొంది. తాలిబన్లలో కూడా కరోనా వ్యాపించి ఉంటుందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. తాలిబన్లు అసలు మాస్క్ ధరించలేదనే ఎలన్ మస్క్ విమర్శలు ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటున్నారు. తాలిబన్లపై(Talibans) భయంతో ఆ దేశం నుంచి బయటపడేందుకు ప్రజలు ప్రయత్నిస్తుండటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. 

Also read: Corona Third Wave: అక్టోబర్ నెలలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్, భయపెడుతున్న ఆ నివేదిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Indians Evacuated from Afghanistan tested corona positive, focus on more tests
News Source: 
Home Title: 

Coronavirus: ఆఫ్ఘన్ నుంచి ఇండియా వచ్చినవారికి కరోనా వైరస్, ఆందోళన కల్గిస్తున్న పరిణా

Coronavirus: ఆఫ్ఘన్ నుంచి ఇండియా వచ్చినవారికి కరోనా వైరస్, ఆందోళన కల్గిస్తున్న పరిణామాలు
Caption: 
Afghan returns ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Coronavirus: ఆఫ్ఘన్ నుంచి ఇండియా వచ్చినవారికి కరోనా వైరస్, ఆందోళన కల్గిస్తున్న పరిణా
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, August 24, 2021 - 07:13
Created By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
55
Is Breaking News: 
No