IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు

IRCTC Alert: మీ ఐఆర్సీటీసీ ఐడీ ఎవరైనా అడిగితే ఇచ్చేస్తున్నారా..టికెట్ బుకింగ్ కోసమే కదా ఏమవుతుందిలే అని అనుకుంటున్నారేమో. ప్రమాదంలో పడతారు జాగ్రత్త. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 24, 2024, 05:50 AM IST
IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు

IRCTC Alert: చాలామంది ఐఆర్సీటీసీ ఐడీ వివరాలను ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే కాదనకుండా షేర్ చేస్తుంటారు. లేదా ఫ్రెండ్స్ కోసం టికెట్ బుక్ చేసి ఇస్తుంటారు. ఇకపై ఇది కుదరదు. అలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. మీ ఐడీతో మరొకరి టికెట్ బుక్ చేయడం ఇకపై నేరం. ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. 

రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునేవారు ఇకపై కొన్ని విషయాలపై అప్రమత్తంగా ఉండాలి. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ బుకింగ్ చేయడానికి వీలుంది. ఏజెంట్లు కానివారు ఇతరులకు టికెట్ బుక్ చేయడానికి లేదు.  వ్యక్తిగతంగా ఎవరివారు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ లాగిన్ అవసరమౌతుంది. దీనికోసం చాలామంది తెలిసినవాళ్లనో,ఫ్రెండ్స్ నో అడిగి లాగిన్ వివరాలు తీసుకుంటుంటారు. అంటే ఒకరి ఐడీతో మరొకరు టికెట్ బుక్ చేసుకుంటుంటారు. ఇకపై ఇది సాధ్యం కాదు. అంటే మీ ఐఆర్సీటీసీ వివరాలను మరొకరికి షేర్ చేయడం కుదరదు. 

నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఐడీతో కేవలం రక్త సంబంధీకులకే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ లేదా తెలిసినవాళ్లకు టికెట్ బుక్ చేయడం కుదరదు. ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్న యూజర్ నెలకు 24 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అది కూడా యూజర్ సహా కుటుంబీకులకు మాత్రమే చెల్లుతుంది. స్నేహితులకో, తెలిసినవారికో టికెట్ బుక్ చేస్తే నిబంధనలు అతిక్రమించినట్టే మరి.

ఇలా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలుంటాయి. మూడేళ్లు జైలు శిక్ష లేదా 10 వేల రూపాయలు జరిమానా ఉంటుంది. రైల్వే టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు, పూర్తి పారదర్శకత కోసం ఈ నిబంధనను రైల్వే శాఖ తీసుకొచ్చింది. 

Also read: UP Cop Demote: మహిళ పోలీసుతో లాడ్జీలో యవ్వారం.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోషన్.. ఎక్కడో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News