Indo-China war: ఇండో చైనా వార్‌ జరిగితే.. ఇండియాదే పై చేయి అంటున్న నివేదిక

India vs China war: భారత్, చైనా యుద్ధం ( Indo China war ) జరిగితే విజయం సాధించే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో హిమాలయాల్లో యుద్దంలో రెండు దేశాల పరిస్థితిపై హోవర్డ్ కెన్నెడీ స్కూల్ ( Howard Kennedy school report ) నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం రెండు దేశాల మధ్య యుద్ధంపై అంచనాలు ఇలా ఉన్నాయి.

Last Updated : Jun 23, 2020, 11:24 PM IST
Indo-China war: ఇండో చైనా వార్‌ జరిగితే.. ఇండియాదే పై చేయి అంటున్న నివేదిక

India vs China war: భారత్, చైనా యుద్ధం ( Indo China war ) జరిగితే విజయం సాధించే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో హిమాలయాల్లో యుద్దంలో రెండు దేశాల పరిస్థితిపై హోవర్డ్ కెన్నెడీ స్కూల్ ( Howard Kennedy school report ) నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం రెండు దేశాల మధ్య యుద్ధంపై అంచనాలు ఇలా ఉన్నాయి. భారత్, చైనాల మధ్య యుద్ధం తలెత్తితే  చైనా సైన్యాన్ని భారత ఆర్మీ ధీటుగా సమాధానమిస్తుందనేది నిపుణులు చెబుతున్న మాట. హోవర్డ్ కెన్నెడీ స్కూల్‌కు చెందిన బెల్ఫెర్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ ( Howard Kennedy school’s Belpher centre for science and international affairs ) నివేదిక సైతం ఇదే స్పష్టం చేస్తోంది.

( Also read: Army Chief in Laddakh: లఢక్‌లో ఆర్మీ చీఫ్... సైనికులకు పరామర్శ )

హిమాలయ పర్వతశ్రేణుల్లో జరిగే యుద్ధంలో చైనా ఆర్మీని భారత సైన్యం ఓడించగలదని.. అంతేకాకుండా సైనిక సామర్ధ్యం విషయంలో ఇండియా, చైనా కంటే వెనుకబడి ఉందన్న నిపుణుల అంచనా తప్పని రుజువు చేస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. 

రెండు దేశాల బలాబలాలు:
వెస్టర్న్ థియేటర్ కమాండ్ ( Western theatre command ), టిబెట్, జిన్ జియాంగ్ మిలిటరీ జిల్లాల ప్రాంతాల్లో చైనా 2 లక్షల నుంచి 2 లక్షల 30 వేల ఆర్మీని మోహరించింది. భారతదేశ ప్రాంతీయ ఆర్మీతో సరి సమానంగా ఉన్న ఈ గణాంకాలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువభాగం రష్యా కోసం లేదా జిన్ జియాంగ్ (  Xinjiang Military district ), టిబెట్ ( TIBET )లో తిరుగుబాటును ఎదుర్కోవడానికే ఉద్దేశించిందనేది నిపుణుల అభిప్రాయం. మరోవైపు ఈ బలగాల్లోని అత్యధిక భాగం భారత సరిహద్దు నుంచి దూరంగా ఉన్నాయి. 

అటు ఇండియన్ ఆర్మీ చైనాను ఎదుర్కోవడానికి భూతల, వాయు దళాలుగా విభజించి.. ఉత్తర, మధ్య, తూర్పు కమాండ్‌లుగా విస్తరించి ఉంది. అటు ఎయిర్ ఫోర్స్ అయితే వెస్టర్న్, సెంట్రల్, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌లుగా విభజించి ఉంది. చైనా సరిహద్దు వద్ద ఉన్న మొత్తం ఆర్మీ బలగాల సంఖ్య దాదాపు 2 లక్షల 25 వేల వరకూ ఉంది. 

(Also read: India vs China: తూర్పు లడ్డాఖ్‌లో కీలక పరిణామం )

సైనిక యుద్ధ సామగ్రి మొహరింపు:
ఇక టీ 72 ట్యాంక్‌కు అనుబంధంగా 3 వేలమంది, లడ్డాఖ్‌లో మొహరించిన అరుణాచల్ ప్రదేశ్‌లోని బ్రహ్మాస్ క్రూయిజ్ మిస్సైల్‌కు అనుబంధంగా వేయి మంది ఉన్నారు. చైనా సరిహద్దు ప్రాంతంలో నార్తన్ కమాండ్‌లో 34 వేల దళాలు, సెంట్రల్ కమాండ్‌లో 15 వేల 5 వందల దళాలు, ఈస్టర్న్ కమాండ్‌లో లక్షా 75 వేల 5 వందల దళాలు మొహరించి ఉన్నాయి. 

స్టాటెజిక్ పోస్టర్ ఆఫ్ చైనా అండ్ ఇండియా ( Strategic poster of China and India ) నివేదిక ప్రకారం చైనాకు చెందిన యుద్ధ విమానాల్ని నడిపే వెస్టర్న్ ఎయిర్ ఫోర్స్ కమాండ్, పీఎల్ఏ ఎయిర్ ఫోర్స్ ( PLAAF ) లు భారత సరిహద్దుకు సమీపంలో ఉన్నా సరే... సంఖ్యా పరంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( IAF) తో ఇబ్బందికి గురి కావచ్చు. 

చైనాకు చెందిన మూడు కమాండ్‌లను ఎదుర్కోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాదాపు 270 యుద్ధ విమానాల్ని, 68 గ్రౌండ్ ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సిద్దం చేసింది. ఇది మరింతగా పెరగవచ్చు కూడా. 

( Also read : చైనా పెద్ద ద్రోహి.. ఇండియా-చైనా బై బై అంటూ నిరసన జ్వాలలు )

ఇక పశ్చిమ వాయు విభాగంలో 75 యుద్ధవిమానాల్ని, 34 గ్రౌండ్ ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్‌లను చైనాకు చెందిన టిబెట్ ప్రాంతానికి సమీపంలో మొహరింపజేశారు. తూర్పు వాయు విభాగంలో 101 యుద్ధ విమానాలు, 9 ఏఎల్ జీ (  ALG ) మొహరించారు. 

మరోవైపు రెండు దేశాల వైమానిక దళాల్ని పరిశీలిస్తే చైనాకు చెందిన జే10 ( J-10) యుద్ధ విమానం సాంకేతికంగా ఇండియాకు చెందిన మిరేజ్ 2000ను పోలి ఉంటుంది. ఇక భారతదేశానికి చెందిన  SU-30MKI మాత్రం చైనాకు చెందిన అన్ని యుద్ధవిమానాల కంటే శక్తివంతమైనది. అటు చైనా నాలుగో తరానికి చెందిన 101 యుద్దవిమానాల్ని రష్యా, భారత్‌ల కోసం మొహరించగా... ఇండియా మాత్రం మొత్తం 122 యుద్ధవిమానాల్ని కేవలం చైనా లక్ష్యంగా మొహరించింది. 

ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్‌లో సామర్ధ్యాన్ని కలిగి, గ్రౌండ్ ఎటాక్ చేయగలగిన 50 డ్రోన్‌లను ఇప్పటికే చైనా ఇండియాకు వ్యతిరేకంగా మొహరించడం ద్వారా  ఈ విభాగంలో చైనా కాస్త పైచేయి సాధించింది.

( Also read : తమ జవాన్ల మరణాలపై నోరు విప్పిన చైనా )

రీజినల్ ఎయిర్ పొజిషన్‌లో ఎక్కువ ఎయిర్ ఫీల్డ్స్‌తో ఇండియా చైనా కంటే శక్తివంతంగా ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. 104 చైనా మిస్సైళ్లు ఇండియాలోని ప్రతి భాగాన్ని లక్ష్యం చేసుకోగలవని ఈ నివేదిక చెబుతోంది. అటు ఇండియాకు చెందిన పది అగ్ని 3 లాంచర్లు  చైనా మొత్తాన్ని టార్గెట్ చేయగలదు. మరో పది అగ్ని 3 లాంచర్లు సెంట్రల్ చైనాను లక్ష్యంగా చేసుకోగలవు. ఇంతకుమించి భారతదేశ లక్ష్యం ఎప్పుడూ అత్యధిక సామర్ధ్యాన్ని కలిగే ఉందని తెలుస్తోంది. ఇదే భారత్‌కు బలంగా ఉంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News