IIT Placements: అయితే గత కొద్దికాలంగా ఐఐటీల్లో కూడా ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి. అదే నిజమైతే ఇక ఐఐటీ క్రేజ్ కూడా తగ్గిపోనుందా అనే సందేహాలు కలుగుతాయి. ఇది ఎంతవరకూ నిజం అని పరీశిలిస్తే వాస్తవమేనని తెలుస్తోంది.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో దేశవ్యాప్తంగా ఐఐటీలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐటీ తప్పకుండా ఉంది. ఐఐటీల తరువాతి స్థానం ఎన్ఐటీలది. ఇవి కూడా జాతీయ సంస్థలే. అత్యున్నత ప్రమాణాలతో భవిష్యత్ ఇంజనీర్లను అన్ని రంగాల్లో తయారు చేస్తుంటాయి. అందుకే ఐఐటీ లేదా ఎన్ఐటీ అంటే క్రేజ్ ఎక్కువ. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షల ద్వారా వీటిలో అడ్మిషన్లు లభిస్తాయి. ఐఐటీలో చదివాడంటే ఆ విద్యార్ధి ఇక జెమ్ అని అర్ధం. లక్షల్లో జీతాలిచ్చే ఉద్యోగాలు చదువు పూర్తికాకుండానే ఆఫర్లు వచ్చేస్తుంటాయి. కానీ గత కొద్దికాలంగా పరిస్థితి మారుతోంది.
దేశంలోని ఐఐటీల్లో టాప్ ర్యాంకింగ్ సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, బొంబే ఐఐటీ, ఖరగ్‌పూర్ ఐఐటీ, ఢిల్లీ ఐఐటీ. కాన్పూర్ ఐఐటీలు చెప్పుకోదగ్గవి. బోంబే ఐఐటీ అంటే చాలు ప్రముఖ కంపెనీలు ముందే వచ్చి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తుంటాయి. పోటీ పడి మరీ జాబ్ ఆఫర్లు వస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బోంబే ఐఐటీలో కూడా పూర్తిగా ప్లేస్‌మెంట్స్ లభించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మందగమనం ప్రబావం బోంబే ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలపై కూడా పడుతోంది.
2024లో ప్లేస్మెంట్ కోసం 2000 మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకుంటే ఇంకా 712 మందికి ఉద్యోగాలు రాలేదు. అంటే మొత్తం విద్యార్ధుల్లో 36 శాతం మందికి అవకాశాలు దక్కలేదు. గతంలో ఉద్యోగాలు లభించని విద్యార్ధులసంఖ్య 35.8 శాతం కాగా ఇప్పుడది 2.8 శాతానికి పెరిగింది. 2023లో బోంబే ఐఐటీ నుంచి 2209 మంది రిజిస్టర్ చేసుకుంటే 1485 మందికే ఉద్యోగాలు లభించాయి. 32.8 శాతం మందికి నిరాశ మిగిలింది. బోంబే ఐఐటీలో సాధారణంగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో 100 శాతం ఉద్యోగాలు లభిస్తుంటాయి. కానీ ఈసారి ఈ విభాగంలో కూడా ప్లేస్మెంట్లు పూర్తి కావడం లేదు.
Also read: Voter ID Card: ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో తెలుసా, ఇలా చెక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook