Tablighi Jamaat: తబ్లిగి జమాత్‌ విదేశీ సభ్యులకు మరో కోలుకోలేని షాక్ ఇచ్చిన భారత్

Tablighi Jamaat తబ్లిగీ జమాత్ విషయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2000 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలు భారత్‌లోకి అడుగుపెట్టకుండా వారిపై భారత్ పదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది.

Last Updated : Jun 5, 2020, 11:49 AM IST
Tablighi Jamaat: తబ్లిగి జమాత్‌ విదేశీ సభ్యులకు మరో కోలుకోలేని షాక్ ఇచ్చిన భారత్

న్యూ ఢిల్లీ: Tablighi Jamaat తబ్లిగీ జమాత్ విషయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2000 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలు భారత్‌లోకి అడుగుపెట్టకుండా వారిపై భారత్ పదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. మౌలానా సాద్ ( Maulana Saad ) నేతృత్వంలోని తబ్లిఘి జమాత్ కార్యకలాపాల్లో విదేశీ పౌరులు పాల్గొన్న తర్వాతే భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus ) వేగంగా వ్యాపించిందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో మౌలానా సాద్, అతని కుమారులతో పాటు అనేక మంది తబ్లిఘి జమాత్ సభ్యులు లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి మరీ ఢిల్లీలోని నిజాముద్దిన్ మర్కాజ్ వద్ద ఇస్లాం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచే తబ్లిఘి జమాత్ కార్యకర్తలపై ఓ కన్నేసి పెట్టిన కేంద్రం.. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. తబ్లీగ్ జమాత్ వల్లే తమ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువయ్యాయంటున్న ముఖ్యమంత్రి )

భారత ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన విదేశీ తబ్లిగి జమాత్ సభ్యుల్లో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నారు. లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో భారత సర్కారు ఆదేశాలు ధిక్కరించినందుకుగాను ఇదివరకే ఈ మర్కాజ్‌కి హాజరైన 960 మంది వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News