Army Chopper Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్ చీతా , ఇద్దరు పైలట్లు మృతి

Army Chopper Crash: ఇండియన్ ఆర్మీకు చెందిన మరో చీతా హెలీకాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో జరిగినట్టుగా గుర్తించినా..ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పైలట్ల ఆచూకీ తెలియాల్సి ఉన్నా ఇద్దరూ మరణించినట్టు తెలుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2023, 06:43 PM IST
Army Chopper Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్ చీతా , ఇద్దరు పైలట్లు మృతి

Army Chopper Crash: భారత మిలిటరీకు చెందిన ప్రతిష్ఠాత్మక చీతా హెలీకాప్టర్లు వరుసగా కూలుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం ఆరు నెలలు తిరగకుండానే మరో చీతా హెలీకాప్టర్ కుప్పకూలింది. పైలట్లు, ఛాపర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

అరుణాచల్ ప్రదేశ్‌లోని మండలా పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం 9.15 గంటలకు ఆర్మీకు చెందిన చీతా హెలీకాప్టర్ మండలా పర్వత ప్రాంతంలోని బోమ్డిలా ఏరియాలో తిరుగుతుండగా ఒక్కసారిగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. తక్షణం ఆర్మీ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఛాపర్‌లో సీనియర్ ఆఫీసర్, సిబ్బంది, పైలట్ ఉన్నారు. కచ్చితంగా ఎక్కడ జరిగిందీ ఇంకా తెలియలేదు. స్థానికులు మాత్రం దిరంగ్ ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో పొగ రావడం చూశామంటున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించినట్టుగా సమాచారం అందుతోంది.

అస్సోంలోని మిస్సమరి ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని సెంగేకు వెళ్తున్న క్రమంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయి. మద్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఛాపర్ కూలిపోయినట్టు సమాచారం అందింది. ఘటనా స్థలంలో సిగ్నల్ లేకపోవడంతో ఇంకా ఛాపర్‌ను గుర్తించలేదు. పైలట్, సిబ్బంది గురించి గాలింపు ఇంకా కొనసాగుతోంది. 

వరుస ఘటనలు

2022 అక్టోబర్ నెలలో ఆర్మీకు చెందిన ఓ చీతా హెలీకాప్టర్ కుప్పకూలిన ఘటనలో పైలట్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తవాంగ్ ప్రాంతంలో జరిగింది.

2022 మార్చ్ నెలలో జమ్ముకశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌కు చెందిన బారౌమ్ ప్రాంతంలో మరో చీతా హలీకాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో కో పైలట్ మరణించగా, పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత అతను కూడా చికిత్స పొందుతూ మరణించాడు. 

Also read: H3N2 Cases: విజృంభిస్తున్న హెచ్‌3ఎన్‌2.. మరో ఇద్దరు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News