Covid Cases Updates: దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారి కేసులు 12 వేలకు పైగా నమోదవుతున్నాయి. పాజిటివిటి రేట్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. తక్కువగానే పరీక్షలు చేస్తున్న కొత్త కేసుల సంఖ్య పెరగడం వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12 వేల 249 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన మరో 13 మంది చనిపోయారు. రోజువారి పాజిటివిటి రేట్ 3.94 శాతంగా ఉంది. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
కొవిడ్ నుంచి గత 24 గంటల్లో 9 వేల 862 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు వైరస్ ను జయించిన వారి సంఖ్య 4 కోట్ల 27 లక్షల 25 వేల 55కు చేరింది. రికవరీ రేటు 98.6 శాతంగా ఉంది. రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరగుతుండటంతో యాక్టివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 81 వేల 687 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉంది.
#COVID19 | India reports 12,249 fresh cases, 9,862 recoveries and 13 deaths in the last 24 hours.
Active cases 81,687
Daily positivity rate 3.94% pic.twitter.com/O7T0QQfzI4— ANI (@ANI) June 22, 2022
Read also: AP Inter Results 2022: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
Read also: Vijayakanth Toes: సీనియర్ హీరో విజయకాంత్‌కు అనారోగ్యం.. మూడు వేళ్ల తొలగింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook