India COVID-19 Cases: దేశాన్ని కలవరపెడుతున్న కరోనా

దేశంలో కరోనా టెస్ట్ ల్యాబ్ (Corona test labs) ల సంఖ్య కూడా వేయికి చేరుకుంది. ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే... రికవరీ రేటు కూడా 56.71శాతానికి పెరిగింది. కరోనా మహమ్మారి తీవ్రత దేశాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యలలో ఒకటిగా ఉంది.

Last Updated : Jun 24, 2020, 03:32 PM IST
India COVID-19 Cases: దేశాన్ని కలవరపెడుతున్న కరోనా

దేశంలో కరోనా వైరస్(CoronaVirus) వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకి కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. దీంతోపాటు ఈ మహమ్మారి నిత్యం వందలాది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 15,968 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల పరంగా ఇదే అత్యధికం. వీటితో కలిపి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,56,183కి పెరిగింది. కోవిడ్19 కారణంగా అదే సమయంలో 465 మంది మరణించారు.  అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

కరోనా మహమ్మారి బారిన పడి దేశంలో ఇప్పటివరకు 14,476 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health & Family Welfare) బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 1,83,022 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2,58,685 మంది కోవిడ్ బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. భారత్‌లో తొలిసారి.. పెట్రోల్‌ను దాటేసిన డీజిల్ ధర

దేశంలో మొదటిసారి రెండు లక్షలు దాటిన పరీక్షల సంఖ్య..
మంగళవారం ఒక్కరోజే 2,15,195 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ (ICMR) పేర్కొంది. నిన్నటివరకు 73,52,911 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. దేశంలో కరోనా టెస్ట్ ల్యాబ్ (Corona test labs) ల సంఖ్య కూడా వేయికి చేరుకుంది. ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే... రికవరీ రేటు కూడా 56.71శాతానికి పెరిగింది.

వరుసగా ఐదవ రోజు 14వేలకు పైగా కేసులు..
భారతదేశంలో వరుసగా ఐదవ రోజు కోవిడ్ -19 కేసులు 14,000 కు పైగా నమోదయ్యాయి. బుధవారం ఉదయం వరకు మరణించిన 465 మంది రోగులలో మహారాష్ట్రలో 248 మంది మరణించగా.. ఢిల్లీలో -68, తమిళనాడులో -39, గుజరాత్‌లో -26, ఉత్తర ప్రదేశ్‌లో -19, పశ్చిమ బెంగాల్‌లో -11, రాజస్థాన్లో-9, హర్యానాలో-9, కర్ణాటకలో-8, ఆంధ్రప్రదేశ్‌లో-8, పంజాబ్లో-4, మధ్యప్రదేశ్‌లో-4, తెలంగాణలో -3,  జమ్మూ కాశ్మీర్, ఒడిశా, ఉత్తరాఖండ్‌లో ఇద్దరు చొప్పున, కేరళ, బీహార్, పుదుచ్చేరిలో ఒకరు చొప్పున కరోనాతో మరణించారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News