Corona Cases Updates: కోవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. కేసుల పెరుగుదలతో ప్రజల్లో ఆందోళన మొదలవుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 640 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి పెరిగింది. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 4.50 కోట్లకు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,33,328 గా ఉంది. తాజాగా కేరళలో కరోనా ఒకరు మరణించారు. తాజాగా నమోదైన కేసుల్లో ఏపీలో 3 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గురువారం 6 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కేసుల పెరుగుదలతో ఇప్పటికే కేంద్ర అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని సూచించింది.
కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసుల పెరుగుదల ఉన్నా.. ప్రస్తుతానికి ప్రాణాంతకం తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. సబ్-వేరియంట్‌ను గుర్తిస్తూ.. కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కోవిడ్-19 JN.1 సబ్-వేరియంట్ పెరుగుతున్నా.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విమానాశ్రయాలలో తప్పనిసరి RT-PCR పరీక్షను అమలు చేసే ఉద్దేశ్యం లేదని పేర్కొన్నాయి. కేసులు పెరుగుతున్నా.. కరోనా సోకిన వారిలో 92 శాతం మంది హోమ్ క్వారంటైన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆసుపత్రుల్లో చేరేందుకు ఇష్టపడడం లేదు.
JN.1 సబ్-వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఛండీగఢ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులలో అటెండర్లు, వైద్యులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ప్రజలు మాస్క్‌లు ధరించాలని.. రద్దీ ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. కొత్త JN.1 వేరియంట్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ప్రజలకు సూచించారు. అయితే అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
Also Read: Salaar First Review: సలార్ ఫస్ట్ రివ్యూ... అవేవీ లేకపోయినా గూస్ బంప్స్ గ్యారంటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి