ఇదివరకే కలర్ టీవీల దిగుమతులను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం ఎయిర్ కండీషనర్స్ (Air Conditioners) విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏసీల దిగుమతులను నిషేధించింది. భారత్‌లో రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండీషనర్లను (ఎసీ) దిగుమతి (India Bans Import Of Air Conditioners) చేసుకునే అవకాశం లేదని, భారత్ వాటిపై నిషేధం విధించింది. అదే విధంగా ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ఆ తరహా ఎసీలను భారత్‌లో తయారీ పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెక్ పెట్టడంతో పాటు భారత్‌లో ఉత్పతాదకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఏడాది వివిధ రంగాల్లో స్వావలంబన కోసం ప్రభుత్వం ముందుకు రావాలని నిర్ణయం తీసుకుంది. భారత్ 30 శాతం ఏసీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఏసీల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం.
* భారత్ లో రిఫ్రిజిరేటర్లతో ఎయిర్ కండీషనర్లను (ఎసి) దిగుమతి చేసుకునే అవకాశం లేదు. భారత్ వాటిపై నిషేధం విధించింది.
* ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఆ తరహా ఎసీలను భారత్ లో తయారి పెంచడానికి గానూ ఈ నిర్ణయం తీసుకుంది. (1/2)#AirConditioners pic.twitter.com/blYGJU2eyQ
— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 16, 2020
విదేశాల నుంచి ఎయిర్ కండీషనర్ల దిగుమతిని భారత్ నిషేధంచిందని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లాంటి పథకాలతో దేశీయంగానే ఉత్పాదకత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భారత్ అధికంగా దిగుమతి చేసుకునే కలర్ టీవీలను సైతం కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో తాజాగా ఏసీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe