Independence Day 2023: దేశంలో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డేకు, జనవరి 26 రిపబ్లిక్ డేకు చాలా ప్రాముఖ్యత ఉంది. రెండు సందర్భాల్లోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కానీ రెండు సందర్భాల్లో జరిగే జాతీయ పతాకావిష్కరణలో కొన్ని తేడాలుంటాయి. ఆ తేడాలేంటో, ఎందుకో ఇప్పుుడు తెలుసుకుందాం..
ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని నేలను తాకకుండా కింద నుంచి పైకి ఎగురవేస్తారు. దీనినే పతాక ఆవిష్కరణగా పిలుస్తారు.
అదే రిపబ్లిక్ డే జనవరి 26న కూడా జాతీయ జెండాను పైకే ఎగురవేస్తారు కానీ మడతపెట్టి పైకి పంపిస్తారు. పైకి వెళ్లిన తరువాత జెండా తెరిచి ఆవిష్కరిస్తారు. అంటే జెండాను విడుదల చేయడంగా భావించాలి.
ఆగస్టు 15న బ్రిటీషు నుంచి ఇండియా స్వాతంత్య్రం పొందింది. బ్రిటీషు సంకేళ్లను తెంచుకుని దేశం నిలబడిన రోజు. అందుకే ఆగస్టు 15, 1947న బ్రిటీన్ యూనియన్ జెండాను దించి..భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అప్పట్నించి ఇది కొనసాగుతోంది. మరోవైపు 19050 జనవరి 26న భారత రాజ్యాంగం ఆమోదింపబడింది. అప్పటికే ఇండియా స్వాతంత్య్రం పొంది ఉన్నందున, మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నందున మరోసారి పతాకావిష్కరణ అనేది జరగదు. కేవలం మడత పెట్టి పైకి తీసుకెళ్లి విడుదల చేస్తారు. అంటే అన్ జిప్ చేయడం.
అయితే ఇటు ఇండిపెండెన్స్ డే, అటు రిపబ్లిక్ డే రెండు సందర్భాల్లోనూ జాతీయ గీతం తప్పకుండా పాడాల్సిందే. అంటే చాలావరకు కార్యక్రమాలు ఒకేలా ఉంటాయి. జెండా ఎగురవేయడంలోనే తేడా ఉంటుంది. ఈ రెండింటికీ తేడా తెలుసుకోవడం చాలా అవసరం.
1947 ఆగస్టు 15వ తేదీన దేశం స్వాతంత్య్రం పొందినప్పుడు బ్రిటీష్ యూనియన్ జాక్ ను కిందకు దించి మూడు రంగుల జాతీయ జెండాను తొలిసారిగా ఆవిష్కరించారు. మరోవైపు 1950 జనవరి 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది.
Also read: Independence Day 2023: జాతీయ జెండా తొలిసారిగా ఎగిరింది ఎప్పుడు, జెండాలో ఎన్నిసార్లు మార్పులు జరిగాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook