Black money: చెన్నైలో భారీగా నల్లధనం, ఎన్నికల కోసం దాచారా ?

Black money: చెన్నైలో బంగారం అక్రమ స్మగ్లింగే కాదు..నల్లధనం కూడా భారీగానే వెలుగుచూస్తోంది. ఇన్‌కంటాక్స్ అధికారులు దాడిలో చెన్నైలో భారీగా బ్లాక్‌మనీ బయటపడింది. ఎన్నికల కోసం ఇంత భారీ ఎత్తున నల్లధనం పోగేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 28, 2021, 10:21 PM IST
Black money: చెన్నైలో భారీగా నల్లధనం, ఎన్నికల కోసం దాచారా ?

Black money: చెన్నైలో బంగారం అక్రమ స్మగ్లింగే కాదు..నల్లధనం కూడా భారీగానే వెలుగుచూస్తోంది. ఇన్‌కంటాక్స్ అధికారులు దాడిలో చెన్నైలో భారీగా బ్లాక్‌మనీ బయటపడింది. ఎన్నికల కోసం ఇంత భారీ ఎత్తున నల్లధనం పోగేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

చెన్నై ఎయిర్ పోర్ట్‌ ( Chennai Airport) లో ఇటీవలి కాలంలో బంగారం అక్రమ స్మగ్లింగ్ వ్యవహారాలు బయటపడి సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చెన్నైలో భారీ ఎత్తున నల్లధనం వెలుగుచూసింది. చెన్నైలోని ప్రముఖ టైల్స్ అండ్ శానిటరీ వేర్ తయారీ కంపెనీపై ఇన్‌కంటాక్స్ అధికారులు దాడులు ( Income tax rides) జరిపారు.  ఈ దాడుల్లో ఏకంగా 220 కోట్ల బ్లాక్‌మనీ( 220 crores of black money) బయటపడింది. దీనికి ఏ విధమైన లెక్కలు చూపకపోవడంతో బ్లాక్‌మనీగా అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 26వ తేదీన తొలిసారి జరిపిన సోదాల్లో 8.30 కోట్లు సీజ్ చేసిన అధికారులు ఇవాళ మరోసారి దాడులు నిర్వహించారు. టైల్స్‌కు సంబంధించి లెక్క చూపని కొనుగోలు, అమ్మకాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీనికోసం ఓ సీక్రెట్ ఆఫీసుతో పాటు ఓ సాఫ్ట్‌వేర్ కూడా ఉపయోగించారు. 

ఈ కంపెనీ 50 శాతానికి పైగా లావాదేవీల్ని రికార్డు చేయలేదని సెంట్రల్  బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అధికారులు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బును వినియోగించనున్నారా అనేదానిపై విచారణ చేస్తామన్నారు. చెన్నైలో ఇన్‌కంటాక్స్ దాడులు ఇంకా కొనసాగనున్నాయన్నారు. 

Also read: EPFO Whatsapp Service: ఈపీఎఫ్ఓ మరో కొత్త సేవ ప్రారంభం, ఇక మీ సమస్యలు తక్షణం పరిష్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News