వేతన జీవులు, పింఛనుదారులకు కేంద్రం గుడ్ న్యూస్

వేతన జీవులు, పింఛనుదారులకు కేంద్రం గుడ్ న్యూస్

Last Updated : Feb 1, 2019, 04:54 PM IST
వేతన జీవులు, పింఛనుదారులకు కేంద్రం గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఆదాయ పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించి వేతన జీవులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. నేడు పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీతో సహా సభలోని సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు. కేంద్రం చేసిన ఈ ప్రకటన ప్రకారం రానున్న ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి రూ.5 లక్షల వరకు జీతం పొందేవారిపై ఎటువంటి పన్ను భారం ఉండబోదు. 

అలాగే రూ.6.5 లక్షల వార్షిక ఆదాయం ఆర్జించే వారు కనుక ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టినట్టయితే, పన్ను మినహాయింపు కింద వారు సైతం ఎటువంటి పన్ను చెల్లించనక్కర్లేదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది లబ్ధి పొందనున్నట్టు సర్కార్ స్పష్టంచేసింది. 

Trending News