Heavy Rains Alert: తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా 20 రాషాల్లో రానున్న వారం రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర, దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో జోరువానలు పడనున్నాయి.
వర్షాకాలం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరు వర్షాలు పడుతుంటే రానున్న వారం రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కేరళ, దక్షిణ, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. దక్షిణ ఉత్తర ప్రదేశ్, ఒడిశాలో వేడి గాలులు కొనసాగుతుంటే పశ్చి మ రాజస్థాన్, దక్షిణ ఉత్తర ప్రదేశ్, ఉత్తర మద్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, తూర్పురాజస్థాన్, గుజరాత్‌లో అత్యధికంగా 42 డిగ్రీల వరకూ ఉష్షోగ్రత నమోదైంది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ మద్యప్రదేశ్, ఉత్తర కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్జాయి.
నైరుతి రుతు పవనాలు మహారాష్ట్ర, విదర్బ మద్య ప్రాంతాలు, మద్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఘండ్‌లకు చేరుకున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో ఇవి గుజరాత్, మహారాష్ట్ర మధ్య ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఘండ్, బీహార్ , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వారం రోజుల వరకూ భారీ వర్షాలు పడనున్నాయి. ఇక గుజరాత్, కొంకణ్, గోవా, మద్య మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఉండవచ్చు.
దక్షిణ బారదేశంలో కోస్తాంధ్ర , రాయలసీమ, కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రానున్న వారం రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: LIC Pension Scheme: ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం పెన్షన్ అందుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Heavy Rains Alert: వర్షాకాలం వచ్చేసింది. వారం రోజుల వరకు 20 రాష్ట్రాలకు భారీ వర్షాలు