Rohini Sinduri vs Roopa Moudgil: ఐఏఎస్ vs ఐపిఎస్ వివాదం ఏ టు జడ్ మొత్తం ఎపిసోడ్.. కళ్లకు కట్టినట్టుగా..

IAS Rohini Sinduri vs IPS Roopa Moudgil: సోషల్ మీడియా వేదికగా ఇద్దరు సాధారణ వ్యక్తులు తగవులాడుకోవడం వేరు.. బాధ్యాతయుతమైన హోదాల్లో ఉన్న ఇద్దరు సివిల్ సర్వెంట్స్ తగవులాడుకోవడం వేరు. వీళ్లిద్దరి మధ్య వివాదంలో సరిగ్గా అదే జరిగింది. బదిలీ వేటుకు ముందు వరకు వీళ్లిద్దరిలో ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి ఆ రాష్ట్రంలోని హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉండగా.. ఐపిఎస్ ఆఫీసర్ డి రూపా మౌడ్గిల్ కర్ణాటక రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఐపిఎస్ ఆఫీసర్ డి రూపా వైపు నుంచే ముందుగా ఈ వివాదం మొదలైంది.

Written by - Pavan | Last Updated : Feb 21, 2023, 08:05 PM IST
Rohini Sinduri vs Roopa Moudgil: ఐఏఎస్ vs ఐపిఎస్ వివాదం ఏ టు జడ్ మొత్తం ఎపిసోడ్.. కళ్లకు కట్టినట్టుగా..

IAS Rohini Sinduri vs IPS Roopa Moudgil: ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపిఎస్ రూపా మౌడ్గిల్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీళ్లిద్దరి పేర్లు తెలియని వాళ్లు లేరు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి బ్యూరోక్రాట్స్ గా సేవలు అందిస్తున్న ఈ ఇద్దరు సివిల్ సర్వెంట్స్ చేసిన రచ్చరచ్చ యావత్ దేశాన్ని వారి వైపు తిరిగి చూసేలా చేసింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని వార్తల్లోకి లాగుతూ పతాక శీర్షికలకు ఎక్కేలా చేసిన ఈ ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపిఎస్ రూపా మౌడ్గిల్‌పై కర్ణాటక సర్కారు బదిలీ వేటు వేసింది. 

ఆ ఇద్దరినీ ప్రభుత్వం ఇక పక్కకు పెట్టినట్టేనా ?
ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపిఎస్ రూపా మౌడ్గిల్ పై బదిలీ వేటుతో సరిపెట్టుకోని కర్ణాటక సర్కారు.. వారికి ఇంకా ఎక్కడా పోస్టింగ్స్ కూడా ఇవ్వకుండా హోల్ట్ చేసి వారి భవిష్యత్తును సస్పెన్స్‌లో పెట్టింది. సర్వీస్ రూల్స్ నిబంధనలను పక్కనపెట్టి బాధ్యాతాయుతమైన హోదాల్లో ఉన్న ఈ ఇద్దరు సివిల్ సర్వెంట్స్ సోషల్ మీడియా వేదికగా కొనసాగించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు కాస్తా పబ్లిక్ పంచాయతీ అవడంతో ఈ వివాదం కర్ణాటక ప్రతిష్టను దిగజార్చింది అని కర్ణాటక సర్కారు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై వీరికి ఇవ్వబోయే పోస్టింగ్స్ ఏ మాత్రం ప్రాధాన్యత లేని నామమాత్రపు పోస్టింగ్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమ స్థాయి మర్చిపోయి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసిన వీళ్లిద్దరికి ప్రాధాన్యత లేని పోస్టింగ్స్ ఇవ్వడమే ఆ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ఇచ్చే పనిష్మెంట్‌ అనే టాక్ వినిపిస్తోంది.

అసలు ముందుగా మొదలుపెట్టింది ఎవరు ?
సోషల్ మీడియా వేదికగా ఇద్దరు సాధారణ వ్యక్తులు తగవులాడుకోవడం వేరు.. బాధ్యాతయుతమైన హోదాల్లో ఉన్న ఇద్దరు సివిల్ సర్వెంట్స్ తగవులాడుకోవడం వేరు. వీళ్లిద్దరి మధ్య వివాదంలో సరిగ్గా అదే జరిగింది. బదిలీ వేటుకు ముందు వరకు వీళ్లిద్దరిలో ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి ఆ రాష్ట్రంలోని హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉండగా.. ఐపిఎస్ ఆఫీసర్ డి రూపా మౌడ్గిల్ కర్ణాటక రాష్ట్ర హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఐపిఎస్ ఆఫీసర్ డి రూపా వైపు నుంచే ముందుగా ఈ వివాదం మొదలైంది.

రోహిణి సింధూరి ఫోటోలను షేర్ చేసిన రూపా
ఫిబ్రవరి 19, 2023, ఆదివారం నాడు ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఐపిఎస్ రూపా.. రోహిణి సింధూరి ఆ ఫోటోలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్ మేల్ ఆఫీసర్లకు పంపించారని.. అలా పంపించడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రోహిణి సింధూరి సివిల్ సర్వెంట్స్ రూల్స్ అతిక్రమించి ప్రవర్తించారు కనుక ఇది ఏ మాత్రం ప్రైవేట్ మ్యాటర్ కాదని.. ఇది పబ్లిక్ మ్యాటర్ కనుకే తాను సోషల్ మీడియా ద్వారా ఆమెను నిలదీస్తున్నానని ఐపిఎస్ ఆఫీసర్ డి రూపా మౌడ్గిల్ తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఇవి 2021, 2022 సంవత్సరాల్లో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లకు రోహిణి పంపించిన ఫోటోలు అని.. ఆ విషయం ఇప్పుడే తన దృష్టికి వచ్చింది కాబట్టే ఇప్పుడు ఫేస్ బుక్ లో పోస్ట్ పెడుతున్నానని.. లేదంటే గతంలోనే ఈ పని చేసి ఉండేదానని అని రూపా స్పష్టంచేశారు.

రెస్టారెంట్‌లో ఎమ్మెల్యే సా రా మహేష్‌తో రోహిణి ఫోటోలు బహిర్గతం చేసిన రూపా
అంతేకాకుండా జనతా దళ్ సెక్యులర్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సా రా మహేష్ ని రోహిణి సింధూరి ఓ రెస్టారెంట్ లో కలిసి భేటీ అయినప్పటి ఫోటోలను కూడా షేర్ చేస్తూ మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో.. అంటే 2021 లో రోహిణి సింధూరి మైసూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యే సా రా మహేష్ పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. సా రా మహేష్ కూడా ఆమెపై అవినీతి ఆరోపణలు చేశారు. అలాంటిది ఈలోగా ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది ? ఒకప్పుడు ఎమ్మెల్యే మహేష్ పై అవినీతి ఆరోపణలు చేసిన రోహిణి సింధూరి.. అవన్నీ మర్చిపోయి ఎందుకిలా ప్రేవేటుగా రెస్టారెంట్ కి వెళ్లి కలవాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.    

IAS-Rohini-Sinduri-vs-IPS-Roopa-Moudgil-case-full-details.jpg

రూపాకు ధీటుగా సమాధానం ఇచ్చిన రోహిణి సింధూరి..
ఐపిఎస్ ఆఫీసర్ రూపా మౌడ్గిల్ తనపై చేసిన ఆరోపణలకు ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి అంతే ధీటుగా స్పందించారు. రూపాకు బాగా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువని.. ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కోరుకునే పిచ్చి మనస్తత్వం ఆమెదని అన్నారు. అందుకే తన వాట్సాప్ స్టేటస్ నుంచి డీపీల నుంచి సేకరించిన ఫోటోలను తీసుకుని తాను ఎవరో ఐఏఎస్ ఆఫీసర్లకు పంపించానని కట్టు కథ అల్లి నిరాధారమమైన ఆరోపణలు చేస్తున్నారని రోహిణి సింధూరి మండిపడ్డారు. తన ఇమేజ్ దెబ్బ తినేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన రూపాపై తాను న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. 

స్పందించిన రోహిణి సింధూరి భర్త 
ఐఏఎస్ రోహిణి సింధూరి భర్త పేరు సుధీర్ రెడ్డి. ఆదివారం ఈ వివాదం మొదలు కాగా.. సోమవారం బెంగళూరులోని బగల్ గుంటె పోలీస్ స్టేషన్ లో రూపాపై రోహిణి భర్త సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూపా చెబుతున్న రోహిణి ఫోటోలు.. ఇప్పటివి కావని.. 2013-14 సమయంలో తీసుకున్న ఆ ఫోటోలను రోహిణి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా షేర్ చేయలేదని.. అటువంటప్పుడు రూపా వద్దకు ఆ ఫోటోలు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రూపా ఆరోపిస్తున్నట్టుగా నిజంగా తన భార్య రోహిణి సింధూరి ఆ ఫోటోలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు పంపించినట్టయితే.. ఆ ముగ్గురు ఆఫీసర్ల పేర్లు వెల్లడించాలి అని డిమాండ్ చేశారు. అది నిజం కాకపోతే.. ఎవరి ఫోన్ హ్యాక్ చేసి రూపా ఆ ఫోటోలు సంపాదించారో చెప్పాలని రూపాపై ఇచ్చిన ఫిర్యాదులో సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.  

అసలు రూపా ఎవరు.. సుధీర్ రెడ్డి..
రోహిణి ఇమేజ్ డ్యామేజ్ చేయడం తప్పితే రూపా ఆరోపణల్లో ఇంకేం కనిపించడం లేదని సుధీర్ రెడ్డి అన్నారు. రోహిణి సింధూరిపై ఏ అధికారంతో ఆమె ఈ ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రూపాకు ఈ విధంగానూ రోహిణితో సంబంధం లేదు. ఇందులో ఈర్ష్యద్వేషం తప్పితే ఏం కనబడలేదు. లేదంటే రూపా పర్సనల్ ఎజెండా ఏంటో చెప్పాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. తన భార్య రోహిణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తారని.. రూపాపై తాము న్యాయపోరాటం చేసి తీరుతామని సుధీర్ రెడ్డి ప్రకటించారు. 

ఐపిఎస్ రూపా మౌడ్గిల్ భర్త ఎవరు ?  
రోహిణి సింధూరి ఫోటోలు ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, ఆమెపై ఆరోపణలు చేసిన రూపా మౌడ్గిల్ భర్త మునీష్ మౌడ్గిల్ కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కర్ణాటక సర్కారు పబ్లిసిటీ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 

ఆ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లను రూపా వెల్లడిస్తారా ?
రోహిణి సింధూరి భర్త సుధీర్ రెడ్డి ప్రశ్నలకు రూపా ఏమని స్పందిస్తారు అనేదే ప్రస్తుతానికి సస్పన్స్‌గా మారింది. సుధీర్ రెడ్డి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి వస్తే.. ఆ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు కూడా వెల్లడించాలి. మరి రుపా వారి పేర్లు వెల్లడిస్తారా లేదా మరేదైనా ఆరోపణలతో సమాధానం దాటవేస్తారా అనేది వేచిచూడాల్సిందే. మొత్తానికి ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ ఆఫీసర్ రూపా మౌడ్గిల్ మధ్య రాజుకున్న ఫోటోల వివాదం వారిపై బదిలీ వేటు వరకు వెళ్లింది. ఇప్పటికైతే వారికి ఇంకా పోస్టింగ్స్ కూడా ఇవ్వలేదు. ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందా ? లేక నెక్ట్స్ లెవెల్‌కి వెళ్తుందా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి : Glamorous Women Politicians: తమను తాము ప్రూవ్ చేసుకున్న గ్లామరస్ లేడీ పొలిటిషియన్స్

ఇది కూడా చదవండి : PM Svanidhi Yojana: ఈ లోన్ తీసుకుంటే నయాపైస వడ్డీ లేదు.. గ్యారెంటీ అసలే లేదు

ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకోవడం ఎలా ?

ఇది కూడా చదవండి : Small Savings Schemes: బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే ఈ వడ్డీ రేట్లే ఎక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News