కూలిపోయిన ఐఏఎఫ్ విమానం.. మంటల్లో బుగ్గిపాలు

ఈ దుర్ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించనున్నట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టంచేసింది. 

Last Updated : Mar 20, 2018, 04:47 PM IST
కూలిపోయిన ఐఏఎఫ్ విమానం.. మంటల్లో బుగ్గిపాలు

పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా కలైకుండ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి మంగళవారం మధ్యాహ్నం గాల్లోకి టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానం కొద్దిసేపట్లోనే ఒడిషాలో కుప్పకూలిపోయింది. ఒడిషాలోని మయుర్‌భంజ్ జిల్లాలో ఐఏఎఫ్ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన టైనీ పైలట్‌ని స్థానికులే ఆ విమానం లోంచి వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించనున్నట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టంచేసింది. రోజువారి విధుల్లో భాగంగానే ఈ ఐఏఎఫ్ విమానం టేకాఫ్ అయినట్టు ఐఏఎఫ్ ప్రకటించినట్టు తెలుస్తోంది. 

 

విమానం కూలిపోయిన కాసేపట్లోనే మంటల్లో చిక్కుకుని కాలిపోయినట్టు సమాచారం అందుతోంది. 

Trending News