‘జీవితంలో విమానం ఎక్కుతానని అనుకోలేదు’

లాక్‌డౌన్ సమయంలో అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, కూలీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కూలీల కష్టాలను మాటల్లో వర్ణించలేము. వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ మార్గం మధ్యలోనే కన్నుమూసిన ఘటనలు ఉన్నాయి. Employer Paid for Migrant Workers Flight Tickets

Last Updated : May 28, 2020, 11:11 AM IST
‘జీవితంలో విమానం ఎక్కుతానని అనుకోలేదు’

లాక్‌డౌన్ సమయంలో అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, కూలీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కూలీల కష్టాలను మాటల్లో వర్ణించలేము. వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ మార్గం మధ్యలోనే కన్నుమూసిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో పుట్టగొడుగులు పండించే రైతు తమ వద్ద పనిచేసే వలస కూలీలకు విమానం టిక్కెట్లు బుక్ చేసి అందించగా వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.  బోరుబావిలో పడిన బాలుడు మృతి.. పాపన్నపేటలో విషాదం

ఢిల్లీ నుంచి పాట్నా ప్రయాణంలో భాగంగా 10 మంది వలస కూలీలకు వారి యజమాని పప్పన్ గెహ్లాట్ (రైతు) విమానం టిక్కెట్లు బుక్ చేశారు. గురువారం (మే 28) ఉదయం ఢిల్లీ నుంచి పాట్నా విమానంలో బిహార్ వలస కూలీలు సొంత ప్రాంతానికి బయలురేముందు మీడియాతో మాట్లాడారు. ‘నా జీవితంలో విమాన ప్రయాణం చేస్తానని కలలో కూడా ఊహించలేదు. కానీ మా యాజమని అందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆయనకు ధన్యవాదాలు’ అంటూ ఓ వలస కూలీ హర్షం వ్యక్తం చేశాడు.  బికినీలో రెచ్చిపోయిన నటి.. అందాల ప్రదర్శన

ఈ విషయంపై పుట్ట గొడుగులు పండించే యజమాని రైతు పప్పన్ గెహ్లాట్ సోదరుడు నిరంజన్ గెహ్లాట్ స్పందించారు. ‘తొలుత రైలు టిక్కెట్లు బుక్ చేసి వారికి అందించాలనుకున్నాం. కానీ వీలు కాలేదు. దాంతో మాతో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కూలీలు సైతం ఉన్నారు. వీరిని విమానంలో స్వస్థలాలకు పంపించాలని నిర్ణయించుకుని ఫ్లైట్ టిక్కెట్లు అందించి వారి సంతోషాన్ని రెట్టింపు చేశామని’ చెప్పారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News