PLI scheme: పీఎల్‌ఐ పథకానికి అనూహ్య స్పందన.. ప్రభుత్వ అంచనాలను మించిన దరఖాస్తులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అద్భుత స్పందన వచ్చింది. లక్ష్యానికి మించి ఈ పథకం విజయం సాధించటంతో.. ఈ స్కీమ్ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1.97 లక్షల కోట్లను కేటాయించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2022, 01:26 PM IST
  • ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అద్భుత స్పందన
  • ప్రభుత్వ అంచనాలను మించిన దరఖాస్తులు
  • పీఎల్ఐ స్కీమ్ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1.97 లక్షల కోట్లను కేటాయింపు
PLI scheme: పీఎల్‌ఐ పథకానికి అనూహ్య స్పందన.. ప్రభుత్వ అంచనాలను మించిన దరఖాస్తులు

Huge Responce for PLI Scheme: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అద్భుత స్పందన వచ్చింది. లక్ష్యానికి మించి ఈ పథకం విజయం సాధించింది. వచ్చే ఐదేళ్లలో ఈ పథకం ద్వారా 60 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచ ఆటోమోటివ్‌ ట్రేడ్‌ లో భారత్‌ వాటా కూడా పెరిగేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. పీఎల్‌ఐ స్కీమ్‌ కింద అప్రూవ్‌ అయిన కంపెనీలకు వచ్చే ఐదేళ్లపాటు ప్రోత్సాహకాలు వస్తాయి.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం.. దేశీయ తయారీ పరిశ్రమ రంగంలో పెట్టుబడులను గణనీయంగా పెంచుతోంది. స్వదేశంలో తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం కల్పించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా 14 రంగాల్లో ఈ స్కీమ్‌ ను ప్రవేశపెట్టింది. దీనికోసం బడ్జెట్‌ లో దాదాపుగా రెండు లక్షల కోట్లకుపైగా కేటాయింపులు చేసింది. మార్చి 2020లో ఈ స్కీమ్‌ను లాంచ్ చేశారు. ఆ తర్వాత 2021-22 బడ్జెట్‌లో పీఎల్ఐ స్కీమ్ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1.97 లక్షల కోట్లను కేటాయించారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద దేశీయంగా తయారీనికి ఊతం ఇచ్చేందుకు ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది. 

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం.. అంటే ఈ పథకం కింద దేశంలో ఉత్పత్తిని పెంచే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తారు. తయారీని పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తిని పెంచే కంపెనీలకు ప్రభుత్వం అదనపు బెనిఫిట్స్‌ కల్పిస్తుంది. ఈ ప్రోత్సాహకాలు ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తాయి. ఈ స్కీమ్ కింద కంపెనీలకు పన్ను రిబేట్లు లభిస్తాయి. ఈ కంపెనీలకు ఎగుమతులు, దిగుమతుల సుంకాలు తక్కువగా ఉంటాయి. పీఎల్‌ఐ పథకం కింద ఆమోదం పొందిన 75 కంపెనీలలో ఆటోమొబైల్‌, ఆటో కాంపోనెంట్‌ ఇండస్ట్రీలలో మారుతీ సుజుకీ, హీరో మోటో కార్ప్‌, బాష్‌, టీవీఎస్‌, మిత్సుబిషి ఎలక్ట్రిక్, టయోటా కిర్లోస్కర్ కంపెనీలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో 42 వేల 500 కోట్ల పెట్టుబడులు రాబట్టాలని  ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా 74 వేల 850 కోట్లు ప్రతిపాదిత ఇన్వెస్ట్‌ మెంట్‌ లను ఈ పథకం ఆకర్షించింది. ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చర్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ కింద ఆమోదించబడిన దరఖాస్తుదారుల నుంచి  45 వేల 16 కోట్లు, కాంపోనెంట్ ఛాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఆమోదించబడిన దరఖాస్తుదారుల నుంచి 29 వేల 834 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్టు కేంద్రప్రభుత్వ అధికారులు తెలిపారు.  పీఎల్‌ఐ స్కీమ్‌తో పెట్టుబడుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ప్రపంచ ఆటోమోటివ్‌ ట్రేడ్‌ లో భారత్‌ వాటా కూడా పెరిగేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. పీఎల్‌ఐ స్కీమ్‌ కింద అప్రూవ్‌ అయిన కంపెనీలకు వచ్చే ఐదేళ్లపాటు ప్రోత్సాహకాలు వస్తాయి.

Also Read: Russian Model Murdered: పుతిన్ పై విమర్శలు చేసిన రష్యన్ మోడల్ మృతి.. సూటుకేసులో మృతదేహం లభ్యం!

Also Read: PAN Aadhaar Link: ఆధార్​తో పాన్​ లింక్ చేయకుంటే ఏం జరుగుతుంది?

PAN Aadhaar Link: ఆధార్​తో పాన్​ లింక్ చేయకుంటే ఏం జరుగుతుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News