Honey Trap Case: హనీ ట్రాప్‌లో డీఆర్డీవో సైంటిస్టు, దేశ రహస్యాలు పాకిస్తాన్‌కు చేరవేత

Honey Trap Case: దేశపు అంతర్గత విషయాల భద్రతకు ముప్పు ఏర్పడింది. దేశ భద్రతలో భాగమైన డీఆర్డీవో శాస్త్రవేత్తలే రహస్యాలు శత్రుదేశాలకు చేరవేస్తున్నారు. హనీ ట్రాప్‌లో పడి అత్యంత రహస్యమైన క్షిపణి సమాచారాన్ని దాయది దేశానికి అందించేశాడు ఆ ప్రబుద్ధుడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 8, 2023, 08:48 PM IST
Honey Trap Case: హనీ ట్రాప్‌లో డీఆర్డీవో సైంటిస్టు, దేశ రహస్యాలు పాకిస్తాన్‌కు చేరవేత

Honey Trap Case: దేశంలో మరో హనీ ట్రాప్ కేసు వెలుగుచూసింది. దేశానికి సంబంధించిన అత్యంత రహస్యమైన విషయాలు శత్రుదేశం పాకిస్తాన్‌‌కు అందించాడు ఆ డీఆర్డీవో సైంటిస్టు. ఓ మాయలాడి వలలో చిక్కుకుని దేశానికి ద్రోహం చేసి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. అసలేం జరిగిందంటే

ఆ డీఆర్డీవో సైంటిస్టు పేరు ప్రదీప్ కురుల్కర్. మహారాష్ట్రలోని పూణేలో డీఆర్డీవో ల్యాబ్ డైరెక్టర్. ప్రదీప్ కురుల్కర్‌కు ఏడాది క్రితం జారా దాస్ గుప్తా అనే ఓ మాయలాడి పరిచయమైంది. యూకేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటూ నమ్మించి బాగా సన్నిహితమైంది. అశ్లీల వీడియోలు, మెస్సేజీలతో చేరువైంది. మాయలాడి ముసుగులో పడిపోయాడు ప్రదీప్ కురుల్కర్. క్రమంగా జారా దాస్ గుప్తా పట్ల వ్యామోహంతో దాసోహమైపోయాడు. ఆమె ఏం చెబితే అది చేసే స్థాయికి వచ్చేశాడు. అత్యంత కీలకమైన భారత క్షిపణి వ్యవస్థకు చెందిన సమాచారాన్ని ఆమెకు షేర్ చేసేవాడు. ద్రోన్లు, క్షిపణులు, బ్రహ్మోస్, అగ్ని క్షిపణి లాంచర్లు, యూసీవీ, మిలిటరీ బ్రిజ్దింగ్ సిస్టమ్ అన్నింటినీ ముందూ వెనుకా ఆలోచించకుండా ఆమెతో చాట్ చేసేవాడు. ఈ ఇద్దరి మధ్య ఈ చాటింగ్ వ్యవహారం 2022 జూన్ నుంచి డిసెంబర్ వరకూ కొనసాగింది. ప్రదీప్ వ్యవహారం, కార్యకలాపాలపై అనుమానమొచ్చిన డీఆర్డీవో అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ విషయం తెలిసిన ప్రదీప్ కురుల్కర్ ఆ మాయలాడి నెంబర్ బ్లాక్ చేశాడు. 

డీఆర్డీవో ఉద్యోగులకు కొన్ని నిబంధనలుంటాయి. అధికారిక షెడ్యూళ్లు, లొకేషన్ల గురించి ఎవరితోనూ సమాచారం షేర్ చేసుకోకూడదు. అయితే ఆ మాయలాడి వలలో పడిన ప్రదీప్ కురుల్కర్‌కు ఇవేమీ పట్టలేదు. అన్ని విషయాల్ని పరిధి దాటి ఆమెతో షేర్ చేశాడు. డీఆర్డీవో సమాచారం మేరకు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు ప్రదీప్ చాట్ వ్యవహారాన్ని పసిగట్టారు. అటు ఆ ఐపీ అడ్రస్ ద్వారా ఆ మాయలాడి పాకిస్తాన్ ఐఎస్ఐకు చెందిన ఏజెంట్‌గా, పాకిస్తాన్ నుంచే చాట్ చేస్తున్నట్టుగా తేలింది. మే 3 వతేదీన ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇతడిపై 1837 పేజీల ఛార్జిషీటు తయారు చేసింది.

దేశానికి చెందిన రహస్యాల విషయంలో రాజీ పడ్డాడని పోలీసులు తెలిపారు. మరో 6 నెలల్లో రిటైర్ కావల్సిన ప్రదీప్ కురుల్కర్ దేశభద్రతను శత్రుదేశానికి అమ్మి ఘోరమైన నేరం చేశాడు. 1923 అధికారిక రహస్యాల చట్టంలో ప్రకారం కేసు నమోదైంది. గతంలో బీహార్‌లో ఇదే తరహా హనీట్రాప్ కేసు వెలుగుచూసింది. ముజఫర్ పూర్ జిల్లాకు చెందిన రవి చౌరాసియా ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ పాకిస్తాన్ మహిళా ఏజెంట్ వలలో పడి దేశ రహస్యాల్ని అమ్మేశాడు.

Also read: Vande Bharat Express: త్వరలో కొత్త రంగులోకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఎలా ఉంటుందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News