దేశ ఆర్థిక రాజధాని ముంబైని రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గ్రేటర్ ముంబైలోని పలు ప్రాంతాలతో సహా థానే, పాల్ఘర్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బీఎంసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటు కర్ణాటకలోని మంగళూరులో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది.
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోకల్ ట్రెయిన్ సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బద్లాపూర్, కళ్యాణ్లనుంచి వెళ్లాల్సిన లోకల్ ట్రెయిన్లను రద్దు చేశారు. దీనితో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర మార్గాల్లో రైళ్లు కనీసం 20 నిముషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
#Maharashtra: Visuals of waterlogged streets from Thane district's Bhiwandi as rain continues to lash the region pic.twitter.com/kYMuCAOAI4
— ANI (@ANI) July 7, 2018
#Maharashtra: Visuals of heavy rainfall from Palghar pic.twitter.com/izVzMJuQDV
— ANI (@ANI) July 7, 2018
#Karnataka: Heavy rain lashes the city of Mangaluru pic.twitter.com/hTHG5ISwpO
— ANI (@ANI) July 7, 2018
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. పలు ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ప్రాణహితలోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో గోదావరికి జలకళ సంతరించుకుంది. వరంగల్, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి.