Godavari Krishna Flood Water Levels: గోదావరి, కృష్ణా నదులకు పోటెత్తుతున్న వరద, వివిధ జలాశయాల్లో నీటిమట్టం వివరాలు

Godavari Krishna Flood Water Levels: నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి, కృష్ణా నదులకు వరద పోటు పెరుగుతోంది. ఇన్ ఫ్లో పెరిగే కొద్దీ రెండు నదులపై ఉన్న జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 20, 2024, 09:13 AM IST
Godavari Krishna Flood Water Levels: గోదావరి, కృష్ణా నదులకు పోటెత్తుతున్న వరద, వివిధ జలాశయాల్లో నీటిమట్టం వివరాలు

Godavari Krishna Flood Water Levels: భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది. రెండు నదుల్లోనూ వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గోదావరి బేసిన్ పరిధిలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. కృష్ణా, గోదావరి నదుల జలశయాలు నిండుతున్నాయి. కృష్ణా నదిలో ఆల్మట్టి నుంచి జూరాల వరకూ నీటిమట్టం పెరుగుతుంటే..గోదావరిలో కాళేశ్వరం దిగువన వరద ప్రవాహం పోటెత్తుతోంది.

గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రెండు నదుల్లోనూ వరద పోటెత్తుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 6 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు.ఆల్మటి, నారాయణపూర్, జూరాల జలాశయాలకు  మరో 10-15 రోజులు వరద ప్రవాహం కొసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకేసారి భారీ వరద వస్తే డ్యామ్ లో ఖాళీ ఉంచేందుకు దిగువన ఉన్న నారాయణపూర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకు నీటిని వదులుతున్నారు. కృష్ణా నదిపై అల్మాట్టి డ్యామ్ పూర్తి సామర్ధ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101.18 టీఎంసీల నీరుంది. అల్మాటీ డ్యామ్ ఇన్ ఫ్లో 61 వేల క్యూసెక్కులుంటే..అవుట్ ఫ్లో 65 వేల క్యూసెక్కులుంది. ఇవాళ సాయంత్రానికి ఇన్ ఫ్లో 80 వేల క్యూసెక్కులకు పెరగవచ్చని అంచనా. ఇక నారాయణ పూర్ డ్యామ్ పూర్తి కెపాసిటీ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34.74 టీఎంసీలకు చేరుకుంది.ఇన్ ఫ్లో 62 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 68 వేల క్యూసెక్కులుంది. 

ఇక జూరాల ప్రాజెక్టు మరో 3-4 రోజుల్లో నిండవచ్చని తెలుస్తోంది. జూరాల పూర్తి సామర్ధ్యం 9.66 టీఎంసీలు కాగా ఇప్పుడు 6.22 టీఎంసీలకు చేరుకుంది. జూరాల నుంచి దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు 37 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి కెపాసిటీ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం33 టీఎంసీల నీరుంది. అదే విధంగా నాగార్జున సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12 టీఎంసీలుంది.ఇక తుంగభద్ర డ్యామ్ నీటి మట్టం కూడా పెరుగుతోంది. టీబీ డ్యామ్ కెపాసిటీ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 59.8 టీఎంసీల నీరుంది. తుంగభద్రకు 1 లక్షా 7 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది

గోదావరికి పోటెత్తుతున్న వరద

కృష్ణా నదితో పోలిస్తే గోదావరి నదికి వరద ముప్పు ఎక్కువగా ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువ సముద్రంలో వదులుతున్నారు. కాళేశ్వరం దిగువన గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 30 అడుగులకు చేరుకోగా దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు సమద్రంలోకి వదులుతున్నారు. 10 లక్షల క్యూసెక్కుల వరకూ వరద చేరవచ్చనే అంచనా ఉంది. అంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయి. భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది 

Also read: IMD Red Alert: ఏపీలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News