Heavy Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటమే కాకుండా..ఉపరితల ద్రోణి కూడా వ్యాపించి ఉండటంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్, విశాఖపట్నం వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనుండగా, కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. తెలంగాణలోని సంగారెడ్డి, మంచిర్యాల, అదిలాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఫలితంగా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు.
ఇక అల్పపీడనం ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. వచ్చే రెండ్రోజులు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఏపీలోని పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
Also read: Times Now ETG Survey: తెలంగాణ మళ్లీ బీఆర్ఎస్దేనా, టైమ్స్ నౌ తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ,, తెలంగాణకు భారీ వర్ష సూచన