Heavy Rains Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Heavy Rains Alert: ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం బలపడుతోంది. రేపటికి అల్పపీడనంగా మారనుండటంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన జారీ అయింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్డ్, మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2023, 09:17 AM IST
Heavy Rains Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రానున్న 48 గంటలు ఏపీ, తెలంగాణల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అవడమే కాకుండా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.

ఈ ఏడాది ఆగస్టు నెలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా..సెప్టెంబర్‌లో ఆశించిన మేర వర్షపాతం నమోదయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పటికే గత రెండు ముూడ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా బలపడనుంది. ఫలితంగా రానున్న 48 గంటల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరంజ్ అలర్ట్ జారీ అయింది. మహబూబ్ నగర్, నారాయణపేట్, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జగిత్యాల జిల్లాల్లో రానున్న 48 గంటల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. ఇక యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, అదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనున్న ఆవర్తనం కారణంగా ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తాలో రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అంతేకాకుండా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే నంద్యాల, ప్రకాశం, కడప, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న 48 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.

Also read: Gaganyaan Launch: సూర్య, చంద్రుల తరువాత ఇప్పుడు గగన్‌యాన్, లాంచ్ తేదీ ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News