Rajyasabha Deputy Chairman: వైసీపీ మద్దతు..టీఆర్ఎస్ దూరం

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా హరివంశ్ సింగ్ ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల్నించి వైసీపీ మద్దతివ్వగా...టీఆర్ఎస్ దూరంగా ఉంది.

Last Updated : Sep 14, 2020, 06:29 PM IST
Rajyasabha Deputy Chairman: వైసీపీ మద్దతు..టీఆర్ఎస్ దూరం

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ( Rajyasabha deputy chairman ) గా హరివంశ్ సింగ్ ( Harivansh singh ) ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల్నించి వైసీపీ మద్దతివ్వగా...టీఆర్ఎస్ దూరంగా ఉంది.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరిగింది. ఎన్డీయే ( NDA ) అభ్యర్ధిగా జనతాదళ్ యునైటెడ్ ( janatadal united ) కు చెందిన హరివంశ్ సింగ్ పోటీ చేయగా...ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా నిలబడ్డారు. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇంతకుముందే పూర్తయింది. వాయిస్ ఓట్ పద్ధతి ద్వారా జరిగిన డిప్యూటీ ఎన్నికల్లో హరివంశ్ సింగ్ ఎన్నికైనట్టు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధికి మద్దతివ్వాల్సిందిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ( Bihar cm Nitish kumar ) స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కు ఫోన్ చేసి అడిగారు. ఇవాళ అంటే పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందే ఇందుకు అనుగుణంగా సీఎం జగన్ తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతివ్వగా...టీఆర్ఎస్ ( TRS ) మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉంది. అటు హరివంశ్ సింగ్ వరుసగా రెండోసారి రాజ్యసభ డిప్యూటీగా ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ సింగ్ కు ప్రదాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. Also read: Assam: పెళ్లి కంటే విధి ముఖ్యం..అందుకే నో లీవ్

Trending News