అహ్మదాబాద్: పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్ధిక పటేల్ కు సంబంధించిన ఓ సెక్సె వీడియో సోషల్ మీడియాలో హచ్ చల్ చేస్తోంది. వైరల్ గా మారిన ఈ వీడియో.. మే 16వ తేదీ చిత్రీకరించినట్లు చూపిస్తోంది. ఈ వీడియోలో హార్ధిక్ పటేల్లా ఉన్న వ్యక్తి ఓ మహిళతో సన్నిహితంగా గడిపినట్లు సృష్టంగా కనిపిస్తోంది. గుజరాత్లో పటేళ్ల రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఆయన..బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయి విరుచుకుపడుతున్నాడు.. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్కు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన రాసలీలలకు సంబంధించిన సీడి బయటపడటంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకోవాలని భావిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై హార్ధిక పటేల్ స్పందిస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో లబ్ది కోసమే మార్ఫింగ్ చేసిన ఈ సీడీని బీజేపీ తెరపైకి తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ సీడీని దేశం బయటే మార్ఫింగ్ చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. గుజరాత్ మహిళల ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇదో భాగమని హార్టిక్ పటేల్ విమర్శించారు.
अब गंदी राजनीति की शुरुआत हो गई हैं।मुझे बदनाम कर लो कोई फ़र्क़ नहीं पड़ेगा,लेकिन गुजरात की महिलाओ का अपमान किया जा रहा हैं।
— Hardik Patel (@HardikPatel_) November 13, 2017
మరోవైపు దీనిపై బీజేపీ నేతలు స్పందిస్తూ ఈ సీడీ బయటికి రావడంతో హార్ధిక్ పటేల్ నిజస్వరూపం బయటప్రపంచానికి తెలిసిందని ఆరోపించారు. హార్ధిక్ పటేల్ అడ్డంగా దొరికిపోయాడని.. హార్థిక్ పటేల్ కట్టు కథలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ..బీజేపీ కౌంటర్ ఇచ్చింది.