గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పటేదార్ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు హార్దిక్ పటేల్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తెలిపింది. అలాగే ఠాకూర్ కమ్యూనిటీ నాయకుడు అల్పేష్ ఠాకూర్‌తో పాటు దళిత పోరాట సమితి నాయకుడు జిగ్నేష్ మవానిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పార్టీ తెలిపింది.
అదేవిధంగా ఈ ఎన్నికలలో గెలవడానికి ఎన్‌సీపీ నేత శరద్ పవార్, జేడీయూ ఎమ్మెల్యే చోటూ వసవాలను కూడా తమ పార్టీకు మద్దతు తెలపాల్సిందిగా కోరింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు భారత్ సిన్హ్ సోలంకీ మాట్లాడుతూ, దాదాపు ఈ ఎన్నికల్లో 182 సీట్లకు గాను కనీసం 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. హార్దిక్ పటేల్ లాంటి యువకులకు తమ పార్టీ టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు.
అలాగే గుజరాత్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా తమతో మాట్లాడుతున్నారని, వారు కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ఇప్పటికి గుజరాత్‌లో పదవిలోకి వచ్చి 22 సంవత్సరాలు కావస్తోంది. ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత విజయ్ రూపానీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
హార్దిక్ పటేల్‌కి కాంగ్రెస్ ఆహ్వానం