ITR 2020: ఆదాయ పన్ను రిటర్న్ గడువును పెంచిన ప్రభుత్వం

కరోనావైరస్ ( Coronavirus ) పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. గతంలో ప్రకటించిన ఆదాయ పన్ను రిటర్న్ ను ( Income Tax Filing )  ఫైల్ చేసే తేదీని జూలై 31 నుంచి 30 నవంబర్  2020కు పెంచినట్టు ఐటీ శాఖ ( Income Tax Department ) ట్వీట్టర్‌లో ప్రకటించింది. 

Last Updated : Jul 4, 2020, 10:26 PM IST
ITR 2020: ఆదాయ పన్ను రిటర్న్ గడువును పెంచిన ప్రభుత్వం

Income Tax Return: ఆదాయ పన్ను చెల్లించే వారికి శుభవార్త. 2018-19 ఆర్థిక సంవత్సరానిక సంబంధించి ఐటిఆర్ ( ITR ) దాఖలు చేసే గడువును పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనావైరస్ ( Coronavirus ) పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. గతంలో ప్రకటించిన ఈ తేదీని జూలై 31 నుంచి ఆదాయ పన్ను రిటర్న్‌ను ( Income Tax Filing ) ఫైల్ చేసే తేదీని 30 నవంబర్ 2020కు పెంచినట్టు ఐటీ శాఖ ( Income Tax Department ) ట్వీట్టర్‌లో ప్రకటించింది. కరోనావైరస్ వల్ల ప్రస్తుతం జాతీయ అంతర్జాతీయ మార్కెట్‌లు కుదేలయ్యాయి. దాని ప్రభావం అందరిపై పడింది. ఇలాంటి సమయంలో ఐటీ శాఖ ఈ ప్రకటన వల్ల ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుంది. ఆదాయ పన్ను శాఖ 2019-20 సంవత్సరానికి సంబంధించిన టీడీఎస్ ( TDS ) , టీసీఎస్ (TCS ) స్టేట్మెంట్ తేదీలను ఆగస్ట్ 15 వరకు పెంచినట్టు తెలిపింది. Also Read :Golden Mask: బంగారు మాస్క్‌తో హల్‌చల్ చేస్తోన్న పూణే గోల్డ్ మ్యాన్

GSTR : జీఎస్టీఆర్ గడువు కూడా పెంపు : జీఎస్టీ రిటర్న్( GST Return ) దాఖలు చేసే గడువును కూడా ప్రభుత్వం ఇటీవలే పెంచింది. ఇకపై జీఎస్టీఆర్ 3 (GSTR 3) ను చెల్లించాలి అనుకునే వారు 30 నవంబర్ 2020లోపు చెల్లిస్తే సరిపోతుంది. దీని ఆలస్య రుసుమును రూ.500కు తగ్గిస్తున్నట్టు సెంట్రల్ డైరక్ట్ ట్యాక్స్ బోర్డు (CBIC ) ప్రకటించింది. 

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Also Read :GST Relief: జీఎస్టీ చెల్లింపుదారులకు ప్రభుత్వం ఉపశమనం  

Trending News