Sputnik v vaccine: ఇండియా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో స్పుత్నిక్ వి చేరిక, త్వరలో అందరికీ అందుబాటులో

Sputnik v vaccine:కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో వ్యాక్సిన్ చేరనుంది. ఇప్పటి వరకూ ప్రైవేటుకే పరిమితమైన ఆ వ్యాక్సిన్ ను ఉచిత వ్యాక్సిన్ జాబితాలో చేర్చారు. ఫలితంగా త్వరలో దేశప్రజలందరికీ అందనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 6, 2021, 05:03 PM IST
Sputnik v vaccine: ఇండియా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో స్పుత్నిక్ వి చేరిక, త్వరలో అందరికీ అందుబాటులో

Sputnik v vaccine:కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో వ్యాక్సిన్ చేరనుంది. ఇప్పటి వరకూ ప్రైవేటుకే పరిమితమైన ఆ వ్యాక్సిన్ ను ఉచిత వ్యాక్సిన్ జాబితాలో చేర్చారు. ఫలితంగా త్వరలో దేశప్రజలందరికీ అందనుంది.

కరోనా మహమ్మారి కట్టడికై ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యాక్సినేషన్ (Vaccination) అందుబాటులో ఉంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ , భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ దేశంలో అందుబాటులో ఉన్నా కేవలం ప్రైవేటు ఆసుపత్రులకే పరిమితమై ఉంది. దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ (DCGI)అనుమతి పొందిన స్పుత్నిక్ వి ఇక ఉచిత వ్యాక్సినేషన్ జాబితాలో చేరింది. అంటే ఇక దేశ ప్రజలకు కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లతో పాటు స్పుత్నిక్ వి కూడా అందనుంది. 

స్పుత్నిక్ వి వ్యాక్సిన్(Sputnik v vaccine) త్వరలో ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో లభించనుంది. ఈ విషయాన్ని కోవిడ్ 19 వర్కింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ కే అరోరా తెలిపారు. ఓ వైపు కరోనా థర్డ్‌వేవ్, మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్ భయం వెంటాడుతున్న తరుణంలో మరో వ్యాక్సిన్ అందుబాటులో రావడం మంచి పరిణామమే. త్వరలో ఇండియాలో అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్(Moderna vaccine), మరో మేకిన్ ఇండియా జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ (Zydus cadilla vaccine) అందుబాటులో రానున్నాయి. అన్ని వ్యాక్సిన్లు అందుబాటులో వస్తే రోజుకు  8 నుంచి 10 మిలియన్ల వ్యాక్సిన్ సరఫరా అవుతుందనే అంచనా ఉంది.

Also read: Oil India Jobs: ఆయిల్ ఇండియాలో ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగాలు, చివరి తేదీ ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News