Gold Seize: విమానాశ్రయాల్లో భారీగా బంగారం పట్టివేత

దేశంలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల నుంచి భారీగా బంగారం (Gold Smuggling)) పట్టుబడింది. దీంతోపాటు వీదేశీ సిగిరేట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు.

Last Updated : Nov 6, 2020, 01:11 PM IST
Gold Seize: విమానాశ్రయాల్లో భారీగా బంగారం పట్టివేత

Gold seize at kozhikode and kolkata international airports: న్యూఢిల్లీ: దేశంలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల నుంచి భారీగా బంగారం (Gold Smuggling)) పట్టుబడింది. దీంతోపాటు వీదేశీ సిగిరేట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. కేర‌ళ‌లోని కోజికొడ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kozhikode International Airport )తోపాటు, బెంగాల్‌లోని నేతాజి సుభాష్ చంద్ర‌బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారంతోపాటు విదేశీ సిగిరేట్లను అధికారులు సీజ్  చేశారు. కేరళ కోజికొడ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఐదుగురు ప్ర‌యాణికుల నుంచి 2,601 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోని సీజ్ (Gold Seize) చేసినట్లు క‌స్ట‌మ్స్ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు మ‌రో ఆరుగురు ప్ర‌యాణికుల నుంచి 59 వేల విదేశీ సిగ‌రెట్ల‌ను, మ‌రో ప్ర‌యాణికుడి నుంచి 624 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. Also read: Kamal Haasan: రజనీకాంత్ మద్దతు కోరుతున్నాం..

ఇదిలాఉంటే.. బెంగాల్‌‌లోని కోల్‌కతా నేతాజి సుభాష్ చంద్ర‌బోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు (Netaji Subhas Chandra Bose International Airport) లో చాక్లెట్ బాక్సుల్లో బంగారాన్ని దాచిపెట్టి తీసుకొస్తున్న ప్రయాణికుడిని సైతం కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాక్లెట్ బాక్సుల్లో దాచిఉంచిన 531.20 గ్రాముల బంగారం పూతను స్వాధీనం చేసుకోన్నారు. అయితే ఈ బంగారం విలువ రూ. 27,62,240 ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు కోల్‌కతా కస్టమ్స్ జోన్ అధికారులు వెల్లడించారు. Also read: Covid-19: భారత విమాన సర్వీసులను రద్దు చేసిన చైనా

Officers of Airport Commissionerate, Netaji Subhas Chandra Bose International Airport recovered 531.20gm gold foils concealed in chocolate boxes & valued at Rs 27,62,240, from a passenger yesterday; passenger arrested: Kolkata Customs Zone pic.twitter.com/UhiZPwEQ0P

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News