Gold Price India: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు ధరలు (Gold Rate Today In India) తగ్గుముఖం పట్టాయి. బంగారం వరుసగా రెండో రోజు ధర దిగిరాగా, వెండి సైతం బంగారం బాటలోనే పయనించింది. రెండు రోజుల వ్యవధిలో వెండి రూ.4వేల మేర ధర తగ్గింది.

Written by - Shankar Dukanam | Last Updated : Aug 21, 2020, 09:33 AM IST
  • భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
  • వరుసగా రెండోరోజూ తగ్గిన పసిడి ధరలు
  • రెండురోజుల్లోనే రూ.4 వేలు తగ్గిన వెండి
Gold Price India: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today In India) దిగొచ్చాయి. వెండి సైతం బంగారం బాలోనే పయనించింది. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.780 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,460కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.720 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,840కి పడిపోయింది. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి

ఢిల్లీలో బంగారం ధరలు (Gold Rate in Delhi) తగ్గాయి. రూ.710 మేర భారీగా ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,850 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.650 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.51,200కి దిగొచ్చింది. Best Interest Rates Banks: అధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పతనమైంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రూ.4000 మేర ధర తగ్గింది. తాజాగా రూ.1,100 మేర ధర తగ్గడంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.67,000 అయింది. దేశం మొత్తం ఇదే ధర కొనసాగుతోంది.  Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos 

Trending News