ఇద్దరు మంత్రులను తొలగించిన సీఎం

ఇద్దరు మంత్రులను తొలగించిన సీఎం

Last Updated : Sep 24, 2018, 02:18 PM IST
ఇద్దరు మంత్రులను తొలగించిన సీఎం

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఇద్దరు మంత్రులను పదవి నుంచి తొలగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా వారిని సీఎం పారికర్‌ పదవుల నుంచి తప్పించారని సిఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మంత్రులు ఫ్రాన్సిస్‌ డిసౌజా, పాండురంగ్‌ మద్కైకర్‌లను కేబినెట్ నుంచి తొలగించారు. ఈ ఇద్దరూ బీజేపీ పార్టీకి చెందిన వాళ్లు కాగా.. వీరి స్థానంలో కొత్త మంత్రులను తీసుకోనున్నారు. ప్రస్తుత గోవా ప్రభుత్వంలో డిసౌజా - పట్టణాభివృద్ధి శాఖ, పాండురంగ్‌ మద్కైకర్‌ - విద్యుత్ శాఖలను చూసుకుంటున్నారు. వారి స్థానంలో బీజేపీ నేతలు నీలేశ్‌ కాబ్రాల్‌, మిలింద్‌ నాయిక్‌లు మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది.

మంత్రులు ఫ్రాన్సిస్‌ డిసౌజా, పాండురంగ్‌ మద్కైకర్‌లు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డిసౌజా అమెరికా ఆస్పత్రిలో, పాండురంగ్‌ ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం పాంక్రియాస్‌ సంబంధిత వ్యాధితో ముఖ్యమంత్రి పారికర్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గోవా సీఎంని మార్చేది లేదని తేల్చి చెప్పిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. ప్రస్తుతం ఖాళీ అయిన మంత్రుల స్థానాలను త్వరగా భర్తీ చేయాలని సూచించారు. 

Trending News