Girl Swallows Mobile Phone: తమ్ముడితో గొడవ.. సెల్‌ఫోన్ మింగేసిన యువతి

Gwalior Girl Swalloed Phone: ఎవరైనా ఇంట్లో వాళ్లతో గొడవపడితే ఏం చేస్తారు..? కాసేపు అరిచి ఊరికే అయిపోతారు.. లేదా దొరికిన వస్తువులను పగలగొట్టి తమ కోపం చల్లార్చుకుంటారు. కానీ ఓ యువతి మాత్రం తమ్ముడితో గొడవపడి ఏకంగా మొబైల్‌ ఫోన్‌నే మింగేసింది. వివరాల్లోకి వెళితే..   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2023, 06:36 PM IST
Girl Swallows Mobile Phone: తమ్ముడితో గొడవ.. సెల్‌ఫోన్ మింగేసిన యువతి

Gwalior Girl Swalloed Phone: మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడితో గొడవ కారణంగా 18 ఏళ్ల అమ్మాయి తమ మొబైల్‌ను మింగేసింది. యువతి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా.. తల్లిదండ్రులు ఆరా తీస్తే అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి.. యువతి కడుపులో నుంచి సెల్‌ఫోన్ బయటకు తీశారు. వివరాలు ఇలా..

భిండ్‌ జిల్లాకు చెందిన అక్కాతమ్ముడు ఇంట్లో ఏదో విషయంలో గొడవ పడ్డారు. దీంతో కోపంతో ఆ అమ్మాయి తన వద్ద ఉన్న చైనీస్ ఫోన్‌ను మింగేసింది. ఆ తరువాత విపరీతమైన కడుపునొప్పితోపాటు వాంతులు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. సెల్‌ఫోన్‌ మింగినట్లు తెలిపింది. దీంతో వెంటనే గ్వాలియర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులోంచి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. 

అక్కాతమ్ముడి మధ్య వివాదం ఇంతటి రూపం దాల్చింది. బాలిక మొబైల్ మింగిన విషయం తెలుసుకుని వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తమ కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి కేసు చూడలేదని చెప్పారు. బాలికకు పది కుట్లు వేశామని.. పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉంది. త్వరలోనే బాలికను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి బాలిక కడుపులో నుంచి మొబైల్‌ను బయటకు తీసినట్లు తెలిపారు.
 
ఢిల్లీలోని తిహార్ జైలులోని ఓ ఖైదీ మొబైల్ ఫోన్‌ను మింగిన విషయం తెలిసిందే. జైలు వార్డెన్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. సెల్ ఫోన్‌తో దొరికిపోతాననే భయంతో మింగేశాడు. కడుపు నొప్పితో ఇబ్బందిపడగా.. వెంటనే జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సెల్ ఫోన్ అతని పొట్టలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే ఆ సెల్ ఫోన్‌ను ఎండోస్కోపి నిర్వహించి.. నోటి ద్వారా బయటకు తీశారు. ఆ సెల్ ఫోన్ 7 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉండగా.. అంత పెద్ద ఫోన్ ఎలా మింగేశాడని జైలు అధికారులు, వైద్యులు ఆశ్చర్యపోయారు.  

Also Read: Gas Price: గుడ్‌న్యూస్.. గ్యాస్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్  

Also Read: KKR vs RCB Highlights: రూ.20 లక్షల ఆటగాడు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ.. ఆర్‌సీబీపై విశ్మరూపం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News