G20 Summit 2023: జీ20కు డిల్లీ సిద్ధం, ఎవరు వస్తున్నారు, ఎవరెవరు రావడం లేదు

G20 Summit 2023: దేశ రాజధాని ఢిల్లీ జీ20 శిఖరాగ్ర సదస్సుకు సిద్ధమైంది. వివిధ దేశాధినేతలు హాజరౌతున్న క్రమంలో ఢిల్లీలో పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2023, 03:39 PM IST
G20 Summit 2023: జీ20కు డిల్లీ సిద్ధం, ఎవరు వస్తున్నారు, ఎవరెవరు రావడం లేదు

G20 Summit 2023: ప్రతియేటా జరిగి జ20 శిఖరాగ్ర సమావేశం ఈ ఏడాది ఇండియా ఆతిద్యంలో జరగనుంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో రెండ్రోజులపాటు జరగనున్న జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ సంసిద్ధమైంది. వివిధ కారణాలతో కొన్ని దేశాలు గౌర్హాజరవుతున్న నేపధ్యంలో ఎవరెవరు హాజరౌతున్నారనేది ఓసారి పరిశీలిద్దాం..

జీ 20 జాబితాలో యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు 19 ఇతర దేశాలున్నాయి. వీటిలో అర్జెంటినా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా దేశాలున్నాయి. 

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్

జీ 20 సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సెప్టెంబర్ 7న ఇండియా రానున్నారు. మోదీతో ద్వైపాక్షిక చర్చల అనంతరం రెండ్రోజులపాటు జరిగే జీ20 సదస్సులో పాల్గొంటారు. 

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రిషి సునాక్ తొలిసారి ఇండియాకు వస్తున్నారు. 

ఆస్ట్రేలియా ప్రధాని ఆంటనీ ఆల్బనీస్

జీ 20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటనీ ఆల్బనీస్ రానున్నారు. ఇండియాతో పాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్ని పర్యటిచనున్నారు.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

ఢిల్లీలో జరిగే జీ20 సదస్సుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో  హాజరుకానున్నారు. ఇండియా కంటే ముందు ఆయన ఇండోనేషియాకు వెళ్లి అక్కడ్నించి ఇండియాకు వస్తారు.

వీరితో పాటు జర్మన్ ఛాన్సిలర్ ఒలాఫ్ షోల్డ్, జపాన్ ప్రదజాని పుమియో కిషిదా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌సుక్‌యో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రన్, సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, దక్షిణాప్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, టర్నీ అధ్యక్షుడు తయ్యబ్ ఎర్దెగాన్, అర్జెంటీనా అధ్యక్షుడు ఫెర్నాండ్ , నైజీరియా అద్యక్షుడు బోలా తినుబు హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు లీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రిస్ మానెల్ లోపెన్ ఇబ్రడార్ హాజరు కావడం లేదు. యూరోపియన్ యూనియన్ తరపున ఎవరు వచ్చేది ఇంకా ఖరారు కాలేదు. ఇటలీ అధ్యక్షుడు జార్జియా మెలోని. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోలు జీ20 సదస్సుకు వస్తారా లేదా అనేది సందిగ్దంగా ఉంది.

Also read: Udayanidhi Remarks: దుమారం రేపుతున్న సనాతనం వ్యాఖ్యలు, పది కోట్ల నజనారాను 10 రూపాయల దువ్వెనతో పోల్చిన ఉదయనిధి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News