వాహనదారులకు స్వల్ప ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గుదల

వాహనదారులకు స్వల్ప ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గుదల

Last Updated : Oct 18, 2018, 04:20 PM IST
వాహనదారులకు స్వల్ప ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గుదల

పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. గురువారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో పెట్రోల్ ధర 21 పైసలు, డీజిల్ ధర 11 పైసలు తగ్గాయి.

తగ్గిన ధరల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు తగ్గి రూ.82.62గా, డీజిల్ లీటర్ 11 పైసలు తగ్గి రూ.75.58గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 21 పైసలు తగ్గి 88.08గా, డీజిల్ లీటర్ 11 పైసలు తగ్గి రూ. 79.24గా ఉంది.

అలాగే కోల్‌కతా, చెన్నై నగరాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కోల్‌కతా‌లో పెట్రోల్ ధర లీటరుకు 22 పైసలు తగ్గి రూ.84.44గా, డీజిల్ లీటర్ రూ.77.43గా ఉంది. చెన్నై పెట్రోల్ ధర లీటరుకు 22 పైసలు తగ్గి రూ.85.88, లీటర్ డీజిల్ ధర రూ.79.93గా ఉంది.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు 22 పైసలు తగ్గి రూ.87.69 కి చేరుకోగా, డీజిల్ ధర 12 పైసలు తగ్గి రూ.82.31కి చేరింది. విజయవాడలో పెట్రోల్ ధర 15 పైసలు తగ్గి రూ.87.15కి , డీజిల్ 11 పైసలు తగ్గి రూ.81.38కి చేరుకుంది.

కాగా.. అక్టోబర్ 16, 17న ఇంధన ధరలు స్థిరంగా కొనసాగాయి.

ఇటీవలే ఆకాశన్నంటుతున్న ఇంధన ధరలు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. ఇంధనాలపై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 1.50 మేర తగ్గించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఇంధన ధరలను రూ.1మేర తగ్గించారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలపై సామాన్యుడికి రూ.2.50 మేర ఉపశమనం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులను రూ.2.50 మేర తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరగా.. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించి సామాన్యుడికి కొంతమేర ఊరట కల్పించాయి.

 

Trending News