లోకల్ ట్రైన్ ప్రయాణంలో ఘోరం జరిగింది. ఫుట్‌బోర్డు ప్రయాణం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన చెన్నై సెయింట్ థామస్ మౌంట్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
సెయింట్ థామస్ రైల్వే స్టేషన్లో.. అందరూ కార్యాలయాలకు, పనులకు వెళ్లే సమయం కావడంతో ఓ సబర్బన్ రైలు కిక్కిరిసింది. దాంతో చాలామంది ప్రయాణీకులు ఫుట్‌బోర్డుపై నిల్చొని ప్రయాణం చేశారు. రైలు స్టేషన్ నుండి వేగం అందుకొని కొంత దూరం వెళ్లాక.. ఫుట్‌బోర్డుపై నిల్చొని ప్రయాణిస్తున్న కొందరు యువకులను కరెంటు స్తంభం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#SpotVisuals: 4 passengers on a local train died, at least 10 injured after being hit by iron poles beside railway tracks at Chennai's St Thomas Mount, while they were travelling on foot-board of a train this morning. More details awaited. #TamilNadu pic.twitter.com/vLK8KDS3NI
— ANI (@ANI) July 24, 2018