Fire in Secretariat: సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం

Kerala Secretariat fire: తిరువనంతపురం: కేరళ సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సచివాలయంలోని నార్త్ బ్లాకులోని ప్రోటోకాల్ విభాగంలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం ( Fire accident ) సంభవించింది. ఇదే నార్త్ బ్లాక్‌లో అన్ని కీలకమైన శాఖల విభాగాల కార్యాలయాలు ఉన్నాయి.

Last Updated : Aug 25, 2020, 08:06 PM IST
Fire in Secretariat: సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం

Kerala Secretariat fire: తిరువనంతపురం: కేరళ సెక్రటేరియట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సచివాలయంలోని నార్త్ బ్లాకులోని ప్రోటోకాల్ విభాగంలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం ( Fire accident ) సంభవించింది. ఇదే నార్త్ బ్లాక్‌లో అన్ని కీలకమైన శాఖల విభాగాల కార్యాలయాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదం గురించి సాయంత్రం 4.45 గంటలకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. Also read : Unlock 4.0: మెట్రో రైలు, థియేటర్లు, విద్యా సంస్థలకు నో చెబుతున్న జనం

కేరళ సచివాలయంలో హౌజ్ కీపింగ్ సెల్ అదనపు కార్యదర్శి పి హనీ మీడియాతో మాట్లాడుతూ.. ఒక కంప్యూటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని అనుమానం వ్యక్తంచేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి మంటలను ఆర్పేశారని, కీలకమైన దస్త్రాలు ఏవీ ధ్వంసం కాలేదని హనీ వెల్లడించారు. సిబ్బంది అంతా క్వారంటైన్‌లో ఉండగా ప్రస్తుతం ఇద్దరే ఆఫీసులో ఉన్నారని.. వారు కూడా ఈ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డారని ఆయన పేర్కొన్నారు. Also read : Sitaphal benefits: సీతాఫలం తింటే కలిగే లాభాలు, నష్టాలు

Trending News