Farm Laws Repeal: From Kangana Ranaut to Sonu Sood, here's how celebs reacted to PM Modi's announcement:నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన దేశ ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కొత్తగా తీసుకువచ్చిన మూడు అగ్రిచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో (Parliament sessions) ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi borders) గత ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న రైతులు ఇళ్లకు వెళ్లి పోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రైతులను బాధ పెట్టి ఉంటే క్షమించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. సిక్కులకు అత్యంత పవిత్రమైన గురు పూర్ణిమ రోజున నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ అనూహ్య ప్రకటన చేశారు. అంతే కాదు.. ప్రధాని క్షమాపణ కూడా చెప్పటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాలతో పాటు సినీరంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.
హీరోయిన్ తాప్సీ (Tapsi) .. ఈ ప్రకటనను ఉద్దేశిస్తూ.. అందరికీ గురు నానక్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu Sood) ఈ నిర్ణయంపై స్పందించారు. ఇదొక అద్భుతమైన విషయమ్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, (Narendra Modi) కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సోనూసూద్. శాంతియుత నిరసనల ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకొన్న రైతులకు అభినందనలు తెలిపారు.
Also….. Gurpurab diyaan sab nu vadhaiyaan 🙏🏽 https://t.co/UgujPdw2Zw
— taapsee pannu (@taapsee) November 19, 2021
This is a wonderful news!
Thank you,@narendramodi ji, @PMOIndia, for taking back the farm laws. Thank you, farmers, for raising just demands through peaceful protests. Hope you will happily return to be with your families on the Parkash Purab of Sri Guru Nanak Dev Ji today.— sonu sood (@SonuSood) November 19, 2021
ఇక శృతి సేథ్ (Shruti Seth) కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్పందించారు. ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి.. భారీ మూల్యం చెల్లించారు.. చివరకు తమ డిమాండ్లను శాంతియుతంగా సాధించుకున్నందుకు గర్వపడుతున్నాను అని పేర్కొన్నారు.మీరు గెలిచారు.. మీ విజయం అందరిది అంటూ నటి రిచా చద్దా (Richa Chadda) పేర్కొన్నారు. అంతిమంగా విజయం మీదే... రైతులందరికీ శుభాకాంక్షలంటూ హిమాన్షి ఖురానా పేర్కొన్నారు. గురునానక్ జయంతి (Guru Nanak Jayanti) సందర్భంగా దక్కిన గొప్ప బహుమతిని తెలిపారు.
So many lives lost. Such a heavy price.
But proud of the farmers for holding their ground, peacefully!Jai Kisaan. Jai Hind. 🇮🇳 https://t.co/l9ZDnYsQca
— Shruti Seth (@SethShruti) November 19, 2021
Also Read :'మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ
ఇక హీరోయిన్ కంగన రనౌత్ .. మొదట్నుంచీ అగ్రికల్చర్ లాస్‌ని (Agriculture Laws) గట్టిగా సపోర్ట్ చేస్తోంది. అందుకోసం సొషల్ మీడియాలో ఇతర సెలబ్రిటీలతోనూ వాగ్యుద్ధాలు చేసింది. ఇంతా చేస్తే ఇప్పుడు పీఎం స్వయంగా చట్టాల్ని రద్దు చేస్తామని ప్రకటించటం బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌కు అస్సలు నచ్చలేదు. సోషల్ మీడియాలో ఒక నెటిజన్ పోస్టుని షేర్ చేసిన కంగనా (Kangana).. తన అభిప్రాయం తెలిపారు. స్ట్రీట్ పవర్.. (Street Power) వీధిపోరాటం గొప్పదని నిరూపితమైందంటూ ఓ నెటిజన్ కామెంట్ షేర్ చేస్తూ కంగన కేంద్రం నిర్ణయంపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన అభిప్రాయం షేర్ చేశారు.
విషాదకరం, అవమానకరం.. ఇది పూర్తిగా అన్యాయం. ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాకుండా రోడ్డు మీది జనం చట్టాలు చేయటం మొదలు పెడితే ఇక మనది కూడా ఒక జిహాదీ దేశమే. ఇటువంటి స్థితి కోరుకున్న వారందరికీ శుభాకాంక్షలు...అంటూ కంగనా రనౌత్ (Kanganarnaut) వ్యవసాయ చట్టాల రద్దుపై (Farm Laws Repeal) తన అభిప్రాయం తెలిపింది. ఇక మరో పోస్టులో ఇందిరా గాంధీ (Indira Gandhi) 104వ జయంతి సందర్భంగా మాజీ ప్రధానిని కూడా తలుచుకుంది కంగనా (Kangana). అయితే, ప్రస్తుత పరిస్థితికి ముడిపెడుతూ అప్పట్లో ఇందిర చెప్పిన మాటల్ని ఆమె షేర్ చేసింది.
Also Read :విషాదం: తమిళనాడులో ఇల్లు కూలి..9 మంది దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook