Etela First Speech in Parliament: ఈటల రాజేందర్.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీగా తొలిసారి లోక్ సభలో అదిరిపోయో స్పీచ్ ఇచ్చారు. ఈటె స్పీచ్ అందరిని ఆకట్టుకునేలా పార్లమెంట్ లో అదరగొట్టాడు. తన స్పీచ్ లో 77ఏళ్ల స్వతంత్ర భారత్ లో 50ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలించింది. అంతేకాదు 2014 వరకు వ్యవసాయం కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
అంతేకాదు వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధరను నరేంద్ర మోడీ సర్కారు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు.
అంతేకాదు కేంద్రంలోని నరేంద్ర మోడీ డబ్బుల కోసం కాదు.. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచిస్తుంది. అంతేకాదు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలి. అంతేకాదు భారత్ యువశక్తి ఉన్న దేశం.. సమీప భవిష్యత్ మొత్తం భారత్ దే అన్నారు. ఈ సందర్బంగా ఈటల మాట్లాడిన మాటలపై నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.
ఈటెల రాజేందర్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్దిక మంత్రిగా.. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాదు అప్పట్లో కేసీఆర్ మంత్రి వర్గానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అంతేకాదు ఉప ఎన్నికల్లో హూజూరా బాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి ఓటమి పాలయ్యారు. కట్ చేస్తే 2024లో బీజేపీ అధిష్ఠానం ఆయనకు మల్కాజ్ గిరి లోక్ సభ సీటు కేటాయించింది. ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter