/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

న్యూఢిల్లీ: అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి చేస్తుండటంతో తమ వ్యక్తిగత విషయాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 2.7 కోట్ల మంది ఉద్యోగుల డేటా లీకైందని ఈపీఎఫ్‌వోకు చెందిన ఆధార్‌ సీడింగ్‌ పోర్టల్‌ నుంచి హ్యాకర్లు ఉద్యోగుల సమాచారాన్ని దొంగిలించారని సంబంధిత శాఖ ఐటీ శాఖకి ఫిర్యాదు చేసింది. ఈమేరకు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ఈ పోర్టల్‌ ఉద్యోగుల ఆధార్‌ నంబర్‌ను వారి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాకు అనుసంధానం చేస్తుంది. ఇందులో భవిష్య నిధి సభ్యుల పేర్లు, చిరునామాలతో వారు ఎక్కడెక్కడ ఉద్యోగం చేశారనే సమాచారం ఉంటుంది.

అయితే..ఆధార్‌ ద్వారా విషయాలు వెల్లడవుతున్న వార్తలను ఈపీఎఫ్‌ఓ తోసిపుచ్చింది. కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ) సంస్థ కేంద్ర సాంకేతిక, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ వీపీ జాయ్‌ దీనికి సంబంధించిన లేఖను సీఎస్‌సీ సీఈఓ త్యాగికి అందజేశారు. సాఫ్ట్ వేర్‌ కారణాలు, రోజువారీ తనిఖీల్లో భాగంగా మార్చి 22, 2018 నుంచి సీఎస్‌సీ సేవలు నిలిపివేసినట్టు వీపీ జాయ్‌ రాసిన లేఖ వైరల్‌ అయ్యింది. సీఎస్‌సీకి రాసిన లేఖ అనేది సర్వీస్‌కు సంబంధించిందే.  డేటా లీకేజీ జరగలేదని, లోపాలు ఉంటే సరిదిద్దడానికే సర్వీసులను నిలిపివేశామని, ఉద్యోగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Section: 
English Title: 
EPFO suspends services through CSC; says no data leakage
News Source: 
Home Title: 

వదంతులను నమ్మొద్దు.. డేటా భద్రం!

ఆ వదంతులను నమ్మొద్దు.. ఈపీఎఫ్ సమాచారం సురక్షితమే!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఆ వదంతులను నమ్మొద్దు.. ఈపీఎఫ్ సమాచారం సురక్షితమే!