Gold Smuggling Hyderabad: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హైదరాబాదీ నగల వ్యాపారి అరెస్ట్

Gold Smuggling Hyderabad: హైదరాబాదీ నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈటీ) అధికారులు అరెస్టు చేశారు. నిబంధలనకు విరుద్ధంగా విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసి.. విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న ఈడీ అధికారులు సంజయ్ ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 05:29 PM IST
Gold Smuggling Hyderabad: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హైదరాబాదీ నగల వ్యాపారి అరెస్ట్

Gold Smuggling Hyderabad: నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకొని అమ్ముతున్న ఓ హైదరాబాదీ నగల వ్యాపారి అరెస్టు అయ్యాడు. హైదరాబాద్ కు చెందిన నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ బంగారాన్ని విక్రయిస్తున్న కారణంగా సంజయ్ అగర్వాల్ ను అరెస్టు చేస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.  

నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.25 కోట్ల విలువైన 54 కిలోల బంగారంతో సహా స్థిరాస్తులను జప్తు చేయడం సహా బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు నిలిపేశారు.

ఏం జరిగిందంటే?

సంజయ్ కుమార్ అగర్వాల్ ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ షాపును నిర్వహిస్తున్నాడు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారాన్ని అక్రమంగా విక్రయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ట్యాక్స్ కట్టకుండా.. విదేశాల నుంచి తెచ్చిన బంగారాన్ని అముతున్నాడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గమనించింది.

దీంతో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. దీనిపై విచారణ జరిపిన కోల్ కతా న్యాయస్థానం ఏప్రిల్ లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత తప్పించుకుపోయిన సంజయ్.. ఇప్పుడు పట్టుబడ్డాడు.

ఈ క్రమంలో సంజయ్ కుమార్ అగర్వాల్.. పుణెలోని లోనావాలా జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యాడు. సమాచారాన్ని తెలుసుకున్న ఈడీ అధికారులు.. సంజయ్ ను అరెస్టు చేశారు. అతడ్ని కోల్ కతా న్యాయస్థానంలో హాజరు పరచగా.. ఏడు రోజుల ఈడీ కస్టడీకి తరలిస్తున్నట్లు ఆదేశించింది.  విచారణ జరిపి నిజానిజాలను కోర్టు ముందుంచుతామని ఈడీ అధికారులు తెలిపారు.  

Also Read: Anand Mahindra: ఇది ఇండియన్ సీఈఓ వైరస్.. దీనికి టీకా అస్సలు లేదు: ఆనంద్‌ మహీంద్రా

Also Read: Sanjay Raut Viral Dance: పెళ్లి వేడుకలో పార్లమెంట్ సభ్యులు సంజయ్ రౌత్, సుప్రియా డ్యాన్స్.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News