Electric Vehicles Charging: ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా

Electric Vehicles Charging: ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల జోరు కన్పిస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్-డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. అసలు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు ఎంత ఖర్చవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 4, 2021, 09:49 AM IST
  • ఎలక్ట్రిక్ వాహనాల రీఛార్జింగ్ ఖర్చుపై స్పష్టత ఇచ్చిన కేరళ ప్రభుత్వం
  • పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో యూనిట్‌కు 15 రూపాయలు
  • ప్రైవేటు రంగంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి ఆహ్వానం
Electric Vehicles Charging: ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా

Electric Vehicles Charging: ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల జోరు కన్పిస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్-డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. అసలు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు ఎంత ఖర్చవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పెట్రోల్-డీజిల్ వాహనాల్నించి ప్రపంచం త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోనుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల(Electric Cars)జోరు మార్కెట్‌లో కన్పిస్తోంది. పెట్రోల్ ధర ఇప్పటికే సెంచరీ దాటగా, డీజిల్ ధర కూడా వందకు చేరువలో ఉంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలే ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణపరంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలు మంచివే. అయితే ఎలక్ట్రిక్ వాహనాల రీఛార్జింగ్‌కు ఎంత ఖర్చవుతుందనే విషయంపై సరిగ్గా స్పష్టత లేదు. దేశంలో అన్నింటికంటే ముందుగా కేరళ(Kerala) ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణంతో పాటు ధరను కూడా ప్రకటించింది. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలు ప్రవేశపెడుతున్నాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సిన పరిస్థితి. 

కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు(Kerala Electricity Board) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను(Public Charging Stations)నిర్మిస్తోంది. ఎక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉంటే అక్కడ ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించింది. మరోవైపు జాతీయ రహదారి వెంట కూడా పబ్లిక్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ యూనిట్లు నెలకొల్పనుంది. ఛార్జింగ్ స్టేషన్ల స్థాపనకు ప్రైవేటు సంస్థల్ని కూడా కేరళ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనులు చేపడితే..తక్కువ సమయంలోనే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో వస్తాయనేది కేరళ ప్రభుత్వం అంచనా. 2020 ఆఖరుకు ప్రభుత్వరంగంలోనే వందకు పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో రానున్నాయి. ఎందుకంటే కేరళలో పెట్రోల్-డీజిల్ వాహనాల వినియోగం తగ్గిపోయింది. స్క్రాప్‌లో అమ్మేస్తున్న పరిస్థితి. కొత్తగా ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కేరళలోనే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. 

ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఖర్చు

పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లతో యూనిట్‌కు 15 రూపాయలు ఛార్జ్ చేయాలని( Electric Vehicle Charging Cost per Unit) కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో ఈ ధర 22 రూపాయలుంది. ప్రైవేటు రంగంలోని ఛార్జింగ్ స్టేషన్లలో యూనిట్ కరెంట్‌కు ఎలక్ట్రిసిటీ బోర్డు 5 రూపాయలు వసూలు చేస్తుంది. పెట్టుబడి, మౌళిక సదుపాయాలు, ఇతర ఖర్చులతో కలిపి దాదాపు 15 రూపాయలుండేలా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

Also read: Pandora Papers Scandal 2021: పండోరా పేపర్స్ అంటే ఏమిటి, సచిన్ పేరుందా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News